Hot Posts

6/recent/ticker-posts

లోకేశ్ తో అందుకే ఫ్రెండ్ షిప్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..


ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ వేరు పడిన తర్వాత ఉమ్మడి నాయకులకు సంబం

ANDHRAPRADESH:ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ వేరు పడిన తర్వాత ఉమ్మడి నాయకులకు సంబంధించి ఏ వార్త అయినా సంచలనంగా మారుతూనే ఉంది. తెలంగాణ ఆవిర్బావం తర్వాత జరిగిన ఎన్నికల్లో అక్కడ చంద్రబాబు, ఇక్కడ కేసీఆర్ గద్దె నెక్కారు. దీంతో చంద్రబాబుతో దోస్తీ చేస్తూ రాష్ట్రాన్ని మళ్లీ భ్రష్టు పట్టిస్తున్నాడని కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పై దుమ్మెత్తిపోశారు. ఆంధ్రా పెత్తనమే మళ్లీ తెలంగాణలో తెచ్చేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారన్న విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కృష్ణ జలాల విషయంలో చంద్రబాబు, ఆ తర్వాత జగన్ ప్రభుత్వంతో బీఆర్ఎస్ ఎలా వ్యవహరించిందన్నది ఇరు రాష్ట్రాల ప్రజలు చూశారు కూడా.

ఇక బీఆర్ఎస్ పాలన ముగిసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ముఖ్యమంత్రిగా రేవంత్ కుర్చీపై కూర్చున్నాడు. రేవంత్ చాలా కాలం టీడీపీలో చంద్రబాబు హయాంలో ముఖ్య నేతగా పని చేశారు. దీన్నే పాయింట్ గా తీసుకున్న బీఆర్ఎస్ నేతలు మళ్లీ చంద్రబాబుతో దోస్తీ చేసి అక్కడి నాయకులకే పగ్గాలు కట్టబెట్టేందుకు రేవంత్ పావులు కదుపుతున్నారని ప్రచారం ముమ్మరం చేశారు. చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో టీడీపీని పటిష్టం చేయాలని చూశారు. రాష్ట్ర అధ్యక్షుల నుంచి కింద స్థాయి వరకు కేడర్ లో మార్పులు తీసుకువచ్చారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ నారా లోకేష్ తో దోస్తీ మొదలు పెట్టాడని, అర్ధరాత్రి పొయ్యి కలిశాడని వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేత స్పందించారు. రేవంత్ వ్యాఖ్యలు అసంబద్ధమైనవి. వాటిలో ఎలాంటి నిజం లేదని, కానీ నేను ఆయనతో దోస్తీ చేస్తే నీకు, నీ పార్టీకి, తెలంగాణకు వచ్చే నష్టం ఏంటని ప్రెస్ మీట్ లో క్వశ్చన్ వేశాడు. ఇప్పటికైతే కలవలేదన్న కేటీఆర్ తాను యువకుడు, నేను యువకుడిని పాలనగురించి మాట్లాడుకుంటాం అయితే తప్పేంటని నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి ఇలా వ్యవహరించడం మంచిది కాదని హితవు పలికారు. 

పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలవాలన్న కేటీఆర్ సీఎంపై విరుచుకుపడ్డారు. ఎప్పుడు బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించినా ఇలాంటి అక్కరకు రాని వ్యాఖ్యలు చేసి తప్పుదారి పట్టిస్తున్నాడని విమర్శించారు. ఇది ముమ్మాటికి వైఫల్యమేనన్న కేటీఆర్ మున్ముందు ఇలాంటి వాటిని సహించేది లేదన్నారు.