Hot Posts

6/recent/ticker-posts

ఏపీ డబ్ల్యు జె ఎ ఫ్ వన సమారాధన పోస్టర్ ఆవిష్కరణలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్

 

జర్నలిస్ట్ ల సంక్షేమం కూడా ప్రభుత్వం బాధ్యత..

పాల్గొన్న అప్కాబ్ చైర్మన్ గన్ని, ఎమ్మెల్యే బడేటి.. ఫెడరేషన్ నాయకులు..

 జర్నలిస్ట్ ల సంక్షేమం కూడా ప్రభుత్వం బాధ్యతని అందు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టు బడి వున్నాయని ఏలూరు ఎం పి పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు.ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ల ఫెడరేషన్ (ఏ పి డబ్ల్యూ జె ఎఫ్ )ఆధ్వర్యంలో ఈ నెల 23న ఏలూరు లో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన పోస్టర్ ను సోమవారం ఎంపి మహేష్ కుమార్ ఆవిష్కరించారు. అప్కాబ్ చైర్మన్, తెదేపా జిల్లాకమిటీ అధ్యక్షులు గన్ని వీరాంజ నేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తదితర నాయకులు కూడా పోస్టర్ ఆవిష్కరణ లో పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా ఎం పి మాట్లాడు తూ మీడియా కు ప్రభుత్వా నికి అవినాభావ సంబంధం ఉందని ప్రభుత్వం పని తీరు పట్ల మొదట గా ప్రతి స్పందించేది మీడియా యేనని ఇద్దరూ పని చేసేది ప్రజలకోసమే నని విశ్లేషణ చేశారు.కూటమి ప్రభుత్వం పాత్రి కేయుల అభివృద్ధి ని ద్రుష్టి లో పెట్టు కునే అక్రిటి డే డషన్లు మంజూరుకు మార్గదర్శకాలను విడుదల చేసిందని చెప్పారు.కాగా కార్యక్రమం లో భాగంగా ఏపీ డబ్ల్యూ జెఎఫ్ జిల్లా అధ్యక్షులు

ఎస్ డి జబీర్ మాట్లాడుతూ నిరంతరం వార్తల సేకరణ తదితర విషయాలలో తీరిక లేకుండా గడిపే పాత్రి కేయులకు అటవిడుపు గా కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసాం అని వివరించారు. ఈ నెల 23వతేదీ ఆదివారం ఏలూరు సమీపం చొదిమెళ్ల ఈ కార్యక్రమం జరగనుందని వివరించారు. జర్నలిస్ట్ లతో పాటు ఏలూరు లోని ప్రజా ప్రతినిధులు రాజకీయ ప్రాముఖులను ఆహ్వానిస్తున్న ట్టు తెలిపారు.ఈ ఆహ్వానం పై ఎంపీ మహేష్ కుమార్, అప్కాబ్ చైర్మన్ గన్ని ఎమ్మెల్యే బుజ్జి వీలుంటే తప్పక వస్తామని మీడియా అందరూ కలుస్తారని సానుకూలంగా మాట్లాడారు.కార్యక్రమం లో జర్నలిస్ట్ సంఘ ప్రతి నిధులు... పాల్గొన్నారు.