Hot Posts

6/recent/ticker-posts

ఏపీలో ఇల్లు లేని నిరుపేదలకు గుడ్‌న్యూస్...అప్లై చేసుకునేందుకు ఉండాల్సిన అర్హతలు, భూ కేటాయింపులపై పూర్తి వివరాలు ఇవే


 రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ప్రజలకు సొంత ఇల్లు నిర్మించుకునేందుకు కూటమి ప్రభుత్వం ‘అందరికీ ఇళ్లు’ అనే పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా సొంత ఇల్లు లేనివారికి ఇంటి స్థలం మంజూరు చేయనుంది ప్రభుత్వం. అర్హులైన లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమిని కేటాయించనున్నారు. 

సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇటీవలే ఈ పథకానికి ఆమోదం తెలిపి మార్గదర్శకాలను సైతం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇంటి స్థలం కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

 ఈ పథకం కింద కూటమి ప్రభుత్వం గ్రామాల్లో పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం కేటాయించాలని నిర్ణయించింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్లు లేనివారు ఉండకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. 

ఈ మేరకు అందరికీ ఉచిత ఇళ్ల పట్టాల పథకం 2025. ఈ పథకంలో భాగంగా ఇంటి స్థలం కేటాయిస్తారు. పట్టణ ప్రాంతాల్లో నివసించేవారికి 2 సెంట్ల భూమి, గ్రామాల్లో నివసించే వారికి 3 సెంట్ల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే అర్హులైన వారికి మహిళ పేరుతో ఈ భూమిని కేటాయిస్తారు. 

ఇకపోతే ఇంటి స్థలం లేదా ఇల్లు పొందినవారికి 10 ఏళ్ల తర్వాత ఆ ఇంటిపై పూర్తి హక్కులు లభిస్తాయి. జీవితంలో ఒకసారి మాత్రమే హౌస్ సైట్ లభిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ దరఖాస్తు ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించింది. అందరికీ ఇళ్లు పథకం అర్హత పొందాలంటే ఏం చేయాలి...నిబంధనలు ఏం చెప్తున్నాయో ఓసారి తెలుసుకుందాం.

అర్హతల వివరాలు ఇవే

అందరికి ఇళ్లు-2025 పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారు ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా సొంత ఇల్లు గానీ, స్థలం గానీ కలిగి ఉండకూడదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నుంచి ఎలాంటి ఇంటి స్థలం పొంది ఉండకూడదు.

కేంద్ర, రాష్ట్ర పభుత్వాల హౌసింగ్ స్కీంలలో దేని ద్వారానూ లబ్ధి పొంది ఉండకూడదు.

లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పౌరుడై ఉండాలి

ఏపీయే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ ఉండకూడదు.

అభ్యర్థి కుటుంబానికి 2.5 ఎకరాల మగాని భూమి లేదా 5.0 ఎకరాల మెట్ట భూమి మించకుండా ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారికి మాత్రమే అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇంటి స్థలం లేదా ఇల్లు పొందే అవకాశంఉంది.

గైడ్‌లైన్స్ ఇవే

పట్టణాల్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంటే లబ్ధిదారులకు 2 సెంట్ల ఇంటి స్థలం కేటాయింపు. ఒకవేళ ప్రభుత్వ భూములు లభించకపోతే ఏపీ టిడ్కో, యూఎల్బీ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం.

ఇంటి స్థలం లేదా ఇల్లు పొందిన వారికి దానిపై 10 ఏళ్ళ తర్వాత సర్వహక్కులు లభిస్తాయి.

ఒక వ్యక్తి జీవితంలో ఒక్కసారి మాత్రమే హౌస్ సైట్ పొందేందుకు అర్హుడు.

పట్టా ఇచ్చిన రెండేళ్ల లోగా లబ్ధిదారుడు ఇంటిని నిర్మించుకోవాలి.

ప్లాటును ఆధార్, రేషన్ కార్డులతో లింక్ చేయడం తప్పనిసరి.

అందరకీ ఇళ్లు పథకం దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు:

కావాల్సిన పత్రాలు

ఆధార్ కార్డు

ఆదాయ ధ్రువీకరణ పత్రం

తెల్ల రేషన్ కార్డు

బ్యాంక్ ఖాతా వివరాలు

ఆధార్ లింకైన మొబైల్ నంబర్

పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు

ఇంటి స్థలం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఇంటి స్థలం కోసం అర్హత కలిగిన వారు గ్రామ/వార్డు సచివాలయ కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు ఇటీవలే అప్డేట్ చేసుకున్న తెల్ల రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ వంటి పత్రాలను జత చేయాలి.

పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది