Hot Posts

6/recent/ticker-posts


ఏలూరు జిల్లా భీమడోలు మండలం ఆగడాల లంక గ్రామస్తుడు సిరంగి మురళి కుమారుడు సిరంగి మోహన్ (35) ఆగడాల గ్రామం చర్చి నుండి గుండుగోలు పచారి సామాన్ల నిమిత్తం బైక్ మీద వెళ్తుండగా ఒడ్డుగూడెం స్పీడ్ బ్రేకర్లు దగ్గర వెనుకనుండి లారీ ఢీకొట్టడంతో సిరంగి మోహన్ అక్కడక్కడే మృతి చెందాడు.

  వివరాలు ఇలా ఉన్నాయి...

నాగ హనుమాన్ భీమడోలు ఫ్యాక్టరీ నుండి AP 37 TB 9941 లారీ తౌడు లోడుతో ఆగడాలంక అన్లోడ్ చేసి వస్తుండగా ఒడ్డుగూడెం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాద సమీపంలో ఆగడాల లంక గ్రామస్తులు లారీ  నీ అడ్డగించి డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని పోలీసులు వారికి ఫిర్యాదు చేశారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని లేకపోతే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని గ్రామస్తులు వాపోతున్నారు. పోలీసులవారు నాగ హనుమాన్ యజమాన్యం పైన డ్రైవర్ పైన చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబ సభ్యులు ,గ్రామస్తులు కోరుతున్నారు.