తొలుత వారికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం లభించింది. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు,,, ప్రత్యేక పూజలను నిర్వహించారు. దర్శనానంతరం ఎమ్మెల్యే చంటి, మీనా దంపతులను కార్పొరేటర్ నాయుడు పృధ్వీ శారద, క్లస్టర్ ఇంచార్జ్ సోము దంపతులు ఘనంగా సత్కరించగా,,, అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు.
అదేవిధంగా ఆలయాభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కార్తీకమాసంలో భక్తులు ఎంతోనిష్టతో పరమేశ్వరుడ్ని కొలుస్తారని అన్నారు. అటువంటి పూజాకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్న ఆయన,,, ప్రజలందరిపై శివయ్య కరుణాకటాక్షాలు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మరకా శివయ్య, ఈవో సతీష్ కుమార్, ధర్మకర్తలు అభిమళ్ళ శ్రీనివాస్, తాళ్ళ గంగ, నిడమర్తి శ్రీలక్ష్మి సూర్య శేషకుమారి, కాకర్ల వెంకట దుర్గ, శీలా దుర్గాప్రసాద్, కాకర్ల వెంకట దుర్గ, రామేశ్వరపు సౌజన్య, గారపాటి ఫణిరాజ్ కుమార్, మారుబారిక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Social Plugin