Hot Posts

6/recent/ticker-posts

2018 లోనే పరిష్కారమైన కొల్లేరు సమస్యలను ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు - ఆపిందెవరు కొల్లేరు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు


 2018 మార్చి నెలలో పరిష్కారమైన కొల్లేరు సమస్యను ఇంతవరకు అమలు చేయకుండా ఏ శక్తులు పని చేశాయి. ప్రభుత్వ అధికారులు ఎందుకు కొల్లేరు సమస్య పరిష్కారము పై ఎందుకు అలసత్వం వహించుచున్నారు. ఆలస్యం చేయుట ఎవరికీ లాభం ఈ విషయంపై పూర్తి విశ్లేషణ .

 వన్యప్రాణి చట్టం 1972 సెక్షన్ 26A సబ్ -సెక్షన్ (3) ప్రకారం '' రాష్ట్ర ప్రభుత్వము ఏదేని అభియారణ్య పరిధిని మార్చవలనంటే (తగ్గించుట/ పెంచుట) జాతీయ వన్యప్రాణి బోర్డు వారి స్టాండింగ్ కమిటీ యొక్క సిఫార్సులు తప్పనిసరి''. ఈ చట్ట ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం మరియు జాతీయ వన్యప్రాణి బోర్డు వారు అభియారణ్య పరిధిని మార్చుటకు సమర్థ అధికారము కలిగి యున్నారు. 

ఈ చట్ట ప్రకారము కేంద్ర సాధికారక సమితి (సి.ఇ. సి) వారికి ఎటువంటి అధికారము లేదు ది. 05.10.2015 గౌరవ భారత సుప్రీంకోర్టు వారు రిట్ పిటిషన్ (సివిల్) 202 of 1995 లో జాతీయ వనములు, వన్యప్రాణి అభియారణ్యం విషయములో ఒక తీర్పును ఇస్తూ ఈ విధంగా ఆదేశించినా రు. (¡) జాతీయ వన్యప్రాణి బోర్డ్ స్టాండింగ్ కమిటీ వారు జాతీయ వనములు వన్యప్రాణి అభయారణ్యము లకు సంబంధించిన అన్ని విషయములలో అనగా జాతీయ వనములు,వన్యప్రాణి అభయారణ్యంలో ఏదేని ప్రాజెక్టుల అమలుకు అనుమతి మరియు వాటి యొక్క హద్దుల హేతుబద్దీకరించటంతో సహ యోగ్యతను అనుసరించి నిర్ణ యము తీసుకొనుటకు అధికారము కలిగి ఉన్నారు.

 అయితే ఈ నిర్ణయములు గౌ. భారత సుప్రీంకోర్టు వారు ఇచ్చిన వివిధ తీర్పులకు, ఆదేశములకు, మార్గదర్శకములకు అనుగుణముగా ఉండవలెను. (¡¡) జాతీయ వన్యప్రాణి బోర్డు వారు తమ యొక్క నిర్ణయముల ఆర్డర్ కాపీని కేంద్ర సాధికారిక సమితి (సి.ఇ.సి) వారికి 30 రోజులలోపు పంపవలెను. (¡¡¡) కేంద్ర సాధికారిక సమితి (సి.ఇ.సి) వారు జాతీయ వన్యప్రాణి బోర్డు వారి యొక్క నిర్ణయముపై ఏదేని ఆపర్తి లేదా ఆ నిర్ణయము గౌ. భారత సుప్రీంకోర్టు వారి యొక్క ఆదేశములు అనుగుణంగా లేని యెడల వారు ఆ విషయమును గౌ.భారత సుప్రీంకోర్టు వారి దృష్టికి సమూచిత దరఖాస్తు / పిటిషన్ ద్వారా తీసుకు వెళ్ళుటకు స్వేచ్ఛను కలిగి ఉన్నారు.

 పై తీర్పు ప్రకారం జాతీయ వన్యప్రాణి బోర్డు వారి నిర్ణయములపై కేంద్ర సాధికారిక సమితి (సి.ఇ.సి) వారు గౌ. భారత సుప్రీంకోర్టులో తమ అభ్యంతరములను ఎటువంటి దరఖాస్తు/ పిటిషన్ ద్వారా కోర్టు వారి దృష్టికి తీసుకు వెళ్ళని యెడల జాతీయ వన్యప్రాణి బోర్డు వారి యొక్క నిర్ణయములను విధిగా అమలు పరచవలెను .

ది. 23.12.2014 తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ వారు కొల్లేరు కాంటూరు పరిధిని తగ్గించమని కోరుచూ ఏకగ్రీవ తీర్మానము చేసి జాతీయ వన్యప్రాణి బోర్డు వారికి పంపినారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు జాతీయ వన్యప్రాణి బోర్డు వారి యొక్క స్టాండింగ్ కమిటీ వారు అనేక పర్యాయములు చర్చించి, ప్రొఫెసర్ ఆర్. సుకుమార్ వారియ ఆధ్వర్యమున ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారి యొక్క సిఫార్సుల మేరకు ది. 27.03.2018 తేదీన జాతీయ వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ వారు తమ 48వ సమావేశములో కొల్లేరు అభయారణ్య పరిధి నుంచి 20,000 ఎకరములు తొలగించుటకు నిర్ణయము తీసుకుని ఆదేశములు జారీ చేసి ఉన్నారు. 

వీటిలో 15,000 ఎకరములు ప్రైవేటు జిరాయితీ రైతుల భూములు, మరియు 5,000 ఎకరములు డి - ఫారం పట్టదారులకు ఈ విధముగా కొల్లేరు సమస్యను జాతీయ వన్యప్రాణి బోర్డు వారి యొక్క స్టాండింగ్ కమిటీ వారు పరిష్కరించినారు.

ది. 25.07.2018 తేదీన కేంద్ర సాధికారిక సమితి(సి.ఇ.సి) వారు రాష్ట్ర ప్రభుత్వము వారికి వ్రాసిన లేఖలో జాతీయ వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ వారి ది. 27.03.2018 తేదీన తీసుకున్న కొల్లేరు పరిధి ని తగ్గించుటకు తీసుకున్న నిర్ణయం గౌ. భారత సుప్రీంకోర్టు వారు ఇచ్చిన వివిధ తీర్పులకు, ఆదేశములకు, మార్గదర్శకములకు, అనుగుణంగా ఉన్నట్లు లేదు. కావున ఆ యొక్క ఆదేశముల అమలు మేము తెలియచేయునంతవరకు నిలిపి వేయవలసిందిగా కోరినారు. 

కానీ, కేంద్ర సాధి కారిక సమితి (సి.ఇ.సి) వారు ఇప్పటివరకు తమ అభ్యంతరములను, నిర్దిష్టమైన వివరములతో రాష్ట్ర ప్రభుత్వం మునకు వ్రాతపూర్వకముగా తెలపలేదు. మరియు గౌ. భారత సుప్రీంకోర్టులో ఎటువంటి దరఖాస్తు/పిటిషన్ వేయలేదు. దీని ప్రకారం ది. 27. 3. 2018 తేదీన జాతీయ వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ వారు తమ 48వ సమావేశంలో కొల్లేరు అభయా రణ్య పరిది నుంచి 20, 000 ఎకరములు తొలగించుటకు తీసుకున్న నిర్ణయము అమలు చేయుటలో ఎటువంటి ఆంక్షలు లేవు. కానీ ప్రభుత్వాధికారులు ఈ విషయమున మరుగున పెట్టి గత ఏడు సంవత్సరంలుగా కాలయాపన చేయుచున్నారు. ఈ విషయము పై కొల్లేరు ప్రజలకు తగిన అవగాహన కల్పించవలెను.

- మాధవరపు గంగాధరం, పెదనిండ్రకొలను,నిడమర్రు మండలం