Hot Posts

6/recent/ticker-posts

రాష్ట్రంలో జనాభా పెరుగుదలపై ఫోకస్ పెట్టాం: చంద్రబాబు


మన దేశానికి అతిపెద్ద ఆర్థిక వనరు జనాభానే అన్న చంద్రబాబు

అమెరికాలో ఫర్టిలిటీ రేటు 1.62 శాతమేనన్న సీఎం

జనాభా పెరుగుదలను తాను సమర్థిస్తున్నానని వ్యాఖ్య

ANDHRAPRADESH:మన దేశానికి అతి పెద్ద ఆర్థిక వనరు జనాభా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో జనాభా పడిపోతోందని చెప్పారు. అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం భారతదేశం అని అన్నారు. మన దేశ జనాభా 143 కోట్లు కాగా... చైనా జనాభా 130 కోట్లు అని చెప్పారు. అమెరికాలో ఫర్టిలిటీ రేటు 1.62 శాతం మాత్రమేనని.... 2.1 శాతం ఫర్టిలిటీ రేటు ఉంటేనే రీప్లేస్ మెంట్ ఉంటుందని... లేకపోతే రోజురోజుకూ జనాభా తగ్గిపోతుందని తెలిపారు. మన దేశంలో బీహార్ లో ఫర్టిలిటీ రేటు 3 శాతంగా ఉందని, ఏపీలో 1.7 శాతానికి చేరుకుందని చెప్పారు. 

ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసేవారని... ఇప్పుడు ఎక్కువ జనాభా ఉన్న దేశాలకు గౌరవం దక్కుతోందని చంద్రబాబు అన్నారు. గతంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే... స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేదనే చట్టాన్ని తాను తీసుకొచ్చానని... ఇప్పుడు జనాభా పెరుగుదలను తానే సమర్థిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో జనాభా పెరుగుదలపై దృష్టి సారించామని తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.