ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో మరింత మంది పిల్లలను కనాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ANDHARAPRADESH:పంచంలో అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో మరింత మంది పిల్లలను కనాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జనాభా ఎక్కువగా ఉన్నారని పిల్లలను కొనొద్దనే పాత రోజులు పోయాయని, ఇప్పుడు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంచిదని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం మాట్లాడిన తాను ఇప్పుడు జనాభా నిర్వహణ కోసం మాట్లాడాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంత ఆస్తిగా భావించాలని ప్రజలకు చంద్రబాబు సూచించారు.
జనాభా అన్నది భారంగా భావించొద్దని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కువ జనాభా ఉండటం మన అదృష్టంగా భావించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యువశక్తి క్షీణిస్తోందని, దీని ప్రభావం అభివృద్ధిపై పడుతోందన్నారు. ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్న తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నారని తెలిపారు. దేశమంటే మనుషులు అనే నినాదానికి సార్థకత చేకూరాలని సీఎం వ్యాఖ్యానించారు.
ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అర్హత లేదని గతంలో తానే చట్టం తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు ఆ చట్టాన్ని ఎత్తివేసి ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీకి అర్హత కల్పించినట్లు వెల్లడించారు. ఇక జనాభా నియంత్రణ బదులు జనాభా నిర్వహణకు సూచనలు కోరుతున్నట్లు తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా పాలసీలు మార్చుకోకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సివస్తుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకప్పుడు జనాభా ఎక్కువగా ఉన్న దేశాలను చులకనగా చూసేవారు ఇప్పుడు జనాభా ఎక్కువగా ఉన్న దేశాలపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. జనమే ప్రధాన ఆస్తిగా భావించే రోజులు వచ్చాయని చంద్రబాబు వివరించారు. ప్రత్యుత్పత్తి రేటు 2.1 గా ఉంటే జనాభా పెరుగుదల స్థిరంగా ఉంటుంది. మన రాష్ట్రంలో ఆ రేషియో 1.8గా ఉంది. ఇది మెరుగుపడాలని సీఎం సూచించారు.
Social Plugin