ప్రజా ప్రతినిధులు సమన్యయంతో పనిచేసి కొల్లేరు ప్రజల సమస్యలు పరిష్కరిద్దామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో కొల్లేరు ప్రజల సమస్యలతో మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యేలు, అటవీ శాఖ అధికారులతో శనివారం ఆయన సమావేశమై మాట్లాడారు.
జిల్లా సమీక్ష ఇతర సమావేశాలకు అటవీ అధికారులు హాజరవడం లేదని ప్రజా ప్రతినిధుల నుంచి ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ కథ ప్రతి సమావేశాన్ని తప్పకుండా హాజరు కావాలన్నారు. కొల్లేరులో అభివృద్ధి పనులకు ప్రణాళికబద్దంగా ముందుకెళ్లాలని సూచించారు.
కొల్లేరు అభయారణ్యం ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు నిబంధనల పేరిట అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్నారని పార్థసారథి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేల నివేదన.. తాగునీటికి లంక గ్రామాల వాసులు ఇబ్బంది పడుతున్నారని కైకలూరు ఎమ్మెల్యే కామి నేని శ్రీనివాస్ పేర్కొన్నారు. మొండి కోడురోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
ఉంగుటూరు నియోజకవర్గంలోని 64 డ్రయిన్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పత్చమట్ల ధర్మరాజు కోరారు. ఏలూరు నగరంలోని కృష్ణ కాలువ గట్టు సుందరీకరణకు చొరవ చూపాలని ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు .పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నివేదించారు.
Social Plugin