లాటరీ తీసి బార్ల కేటాయింపు చేసిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
2025 - 28 సంవత్సర కాలానికి ఓపెన్ కేటగిరి లో మద్యం బార్లకు గురువారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి లాటరీ తీశారు.
ఏలూరు జిల్లా నందు నూతన బార్ పాలసీ 2025-28 భాగంగా ప్రభుత్వం వారు మొదటి నోటిఫికేషన్ లో మిగిలిన (09) ఓపెన్ కేటగిరి బార్లు కు ది. 03.09.2025 న ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ ద్వారా వచ్చిన (08) అప్లికేషన్ లకు గాను 4 లేదా అంతకు ఫైన వచ్చిన అప్లికేషన్స్ బార్లకు అనగా (02) ఓపెన్ కేటగిరి బార్లు కు కలెక్టర్ లాటరీ ద్వారా బార్లను కేటాయించారు. ఈ లాటరీ ద్వారా ప్రభుత్వం వారికి 59.13 లక్షల ఆదాయం సమకూరినది.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బి. శ్రీలత, జిల్లా మధ్య నిషేధ మరియు అబార్కిఅధికారి ఏ. ఆవులయ్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ లు శ్రీ జి. పాండు రంగారావు మరియు శ్రీ అజయ్ కుమార్ సింగ్ , ఏలూరు ఎక్సైజ్ సీఐలు బార్లకు దరఖాస్తు చేసిన 6 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
Social Plugin