ఇప్పుడు జనసేన అంతర్గత వ్యవహారాలపై ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా సంచలన చర్చ జరుగుతోంది.
ANDHRAPRADESH:ఏదైనా పార్టీలో ఉన్న నాయకులు ఎంతో కొంత స్వేచ్ఛ కోరుకుంటారు. తమ అభిప్రాయాలను చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని కూడా ఆశిస్తారు. ఇది రాజకీయంగా నాయకులు కోరుకునే సహజమైన విషయం. పార్టీ ఏదైనా తమ అభిప్రాయాలు చెప్పుకునేందుకు తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని నాయకులు కోరుకునే విషయం. అయితే మితిమీరిన స్వేచ్ఛ ఉన్న కాంగ్రెస్ ఇతర పార్టీల మాదిరిగా కాకుండా ఎంతో కొంత తమకు అవకాశం ఇవ్వాలని కోరుకునే నాయకులు జనసేనలో ఉన్నారు.
ఇప్పుడు జనసేన అంతర్గత వ్యవహారాలపై ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా సంచలన చర్చ జరుగుతోంది. జనసేన తీసుకుంటున్న నిర్ణయాలు, నాయకులపై సస్పెన్షన్ వేటు వంటి కీలక పరిణామాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన టీవీ రామారావుపై పార్టీ సస్పెన్షన్ వేటు వేయడం పార్టీలోనే ఆశ్చర్యానికే గురిచేసింది. అదే సమయంలో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్చార్జి వినుతను పార్టీ నుంచి బహిష్కరించడం కూడా చర్చగానే మారింది. ఈ వారంలో ఈ రెండు పరిణామాలు జనసేనలో తీవ్రంగా చర్చకు వచ్చాయి.
వాస్తవానికి టీవీ రామారావు కొన్ని సూచనలు మాత్రమే పార్టీ అధిష్టానానికి చేశారు. ఎలా అంటే.. కూటమిలో ఉన్నప్పటికీ తమకు విలువ లేకుండా పోయిందని, ముఖ్యంగా టిడిపి నాయకుల నుంచి తమకు ఎలాంటి గౌరవ మర్యాదలు కూడా లభించడం లేదని, కొంతమంది నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం. ఇదే విషయాన్ని రామారావు లేఖ రూపంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాసుకొచ్చారు. ఆయన ఎక్కడ పరుష పదజాలం గానీ, పార్టీపై దిక్కారస్వరంగానే వినిపించలేదు.
అంతేకాదు పార్టీలో గుర్తింపు కోరుకునే వారు చాలామంది ఉన్నారని, పార్టీ జెండా మోసి, పార్టీ కోసం పని చేసిన వారు ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. సహజంగా అంతర్గతత సమావేశాల్లో జనసేన నాయకుల మధ్య చర్చ ఇదే జరుగుతోంది. రామారావు బయటపడినా.. బయటపడని వారు చాలామంది ఉన్నారు. వారందరిదీ ఒకటే ఆవేదన. తాము గత ఎన్నికల సమయంలో కూటమి తరుపున పని చేశామని, కానీ నామినేటెడ్ ఇతర ఏ పదవుల్లోనూ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నది వారి ఆవేదన. సహజంగా రాజకీయాల్లో ఇటువంటి ఆవేదనలు అసంతృప్తులు ఉంటాయి.
నాయకులు హద్దు మీరి మీడియా ముందుకు వచ్చి, యాగి చేసినప్పుడు లేక బహిరంగ వేదికలపై చర్చించి, పార్టీ పట్ల తీవ్రస్థాయి విమర్శలు చేసినప్పుడు చర్యలు తీసుకోవడం తప్పుకాదు. కానీ, రామారావు రాసిన అంతర్గత లేఖను కూడా బయటపెట్టి దానిపై చర్యలు తీసుకోవడం పార్టీ నుంచి సస్పెన్షన్ చేయటం వంటివి జనసేనలో తీవ్ర చర్చకు దారితీసాయి. ఇలా అయితే పార్టీలో ఎంతమంది ఉంటారనేది ఇప్పుడు చర్చగా మారింది. అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ కనీసం సూచనలు సలహాలు చేయడం కూడా తప్ప అని చాలామంది నాయకులు చర్చించుకోవడం తెలిసింది.
Social Plugin