Hot Posts

6/recent/ticker-posts

మాట వినాలి జగన్!


ANDHRAPRADESH:అయితే జగన్ వ్యూహం అనాలో ఎత్తుగడలు అనాలో లేక కూటమిని కట్టడి చేసేందుకు అనాలో తెలియదు గానీ గత కొద్ది నెలలుగా ఆయన జనం లోకి వస్తున్నారు. పరామర్శల పేరుతో జిల్లా టూర్లు పెట్టుకుంటున్నారు.

అవును. వైసీపీలో ఇపుడు ఇదే పేరడీ పాటగా వినిపిస్తోందట. పార్టీలో ఇపుడు నెమ్మదిగా ఒక ఉత్సాహపూరితమైన వాతావరణం అయితే అధినాయకత్వం తీసుకుని వచ్చింది అది కూడా కేవలం భారీ ఓటమి తరువాత కేవలం తొలి ఏడాదిలోనే. నిజంగా 151 సీట్ల నుంచి జారీ పాతాళానికి పడినట్లుగా 11 సీట్ల దగ్గర వైసీపీ ఆగింది. ఈ పదకొండుతో అటు విపక్ష హోదాకు కూడా దక్కకుండా వైసీపీ మిగిలిపోయింది.

ఈ నేపథ్యంలో గత ఏడాదిగా అనేక ఇబ్బందులు వైసీపీ క్యాడర్ పడ్డారు. అయితే జగన్ వ్యూహం అనాలో ఎత్తుగడలు అనాలో లేక కూటమిని కట్టడి చేసేందుకు అనాలో తెలియదు గానీ గత కొద్ది నెలలుగా ఆయన జనం లోకి వస్తున్నారు. పరామర్శల పేరుతో జిల్లా టూర్లు పెట్టుకుంటున్నారు.

దాంతో ఆ టూర్లు కూడా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలో క్యాడర్ లో కూడా ఉత్సాహం వస్తోంది నాయకులు కూడా మెల్లగా రోడ్ల మీదకు వస్తున్నారు ఇక ఇదే ఊపులో జగన్ మరిన్ని జిల్లాల టూర్లకు ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జగన్ టూర్లు చేయవచ్చు కానీ దాని కంటే ముందు పార్టీలో క్యాడర్ మాట వినాలని వారికి పూర్తి భరోసా కల్పించేలా ఆయన వ్యవహరించాలని కోరుతున్నారు. 

వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను తీసుకుని వచ్చింది. దాంతో క్యాడర్ అంతా మూలకు వెళ్ళిపోయారు. వారితోనే అంతా అంటూ ఇంటింటికీ వారినే తిప్పించారు. పార్టీ కోసం అప్పటికి ఏడేళ్ళుగా రోడ్డున పడి తిరిగిన క్యాడర్ కి ఏ మాత్రం ప్రాధాన్యత వైసీపీ తొలి ప్రభుత్వంలో దక్కలేదు అయితే జగన్ మాత్రం 2.0 ఉందని చెబుతున్నారు. ఈసారి క్యాడర్ కే పెద్ద పీట అంటున్నారు. మరి అది ఎలా ఏ రూపంలో అన్నది ఆయన విడమరచి చెబితే బాగుంటుంది అని అంటున్నారు.

ఇప్పటిదాకా అయితే వైసీపీ అధికారికంగా వాలంటీర్ల వ్యవస్థను తాను రద్దు చేయమని స్పష్టం చేయలేదు అని గుర్తు చేస్తున్నారు. పైగా టీడీపీ కూటమిని విమర్శించే క్రమంలో వాలంటీర్లను రోడ్ల మీద వదిలేశారు అని అంటున్నారు. దాంతో మళ్లీ వైసీపీ కనుక అధికారంలోకి వస్తే వాలంటీర్లను తిరిగి తీసుకుంటారా అన్న బెంగ అయిత వైసీపీ క్యాడర్ లో పీకుతోందిట. 

అందువల్ల వారి డౌట్లను తీర్చే క్రమంలో ఇక వాలంటీర్లు మన ప్రభుత్వంలో కనిపించారు అని ఒక నిర్దిష్టమైన హామీని జగన్ ఇస్తే బాగుంటుందని వారు కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు. మరో వైపు చూస్తే ఎమ్మెల్యేలు అంతా గత ప్రభుత్వంలో ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు బటన్ నొక్కుడుకే జగన్ ప్రాధాన్యత ఇచ్చారని దాంతో ప్రజలలో గెలిచి వచ్చిన ఎమ్మెల్యేలకు నేరుగా జనాలతో సంబంధాలు కట్ అయ్యాయని విశ్లేషణలు ఉన్నాయి

అలా కాకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం మాదిరిగా ఏ సంక్షేమ పధకం అయినా ఎమ్మెల్యేల ద్వారానే ఇప్పించేలా వారి నియోజకవర్గాలలో వారి మాటే చెల్లుబాటు అయ్యేలా చూస్తామని హామీ ఇస్తే బాగుంటుందని అంటున్నారుట. ఇక ప్రతీ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి లీడర్స్, పార్టీ క్యాడర్ ఉన్నారని అలా వారందరినీ రప్పించుకుని వారితో భేటీలు వేస్తే జిల్లాల పర్యటనల కంటే కూడా ఎక్కువ ఉపయోగం ఉంటుందని అంటున్నారు.

గ్రౌండ్ లెవెల్ లో ఏమి జరుగుతోంది అన్నది వైసీపీ అధినాయకత్వానికి కచ్చితంగా తెలుస్తుంది అని అంటున్నారు. అదే సమయంలో వైసీపీ ఎక్కడ బలంగా ఉంది, ఎక్కడ బలహీనపడింది, ఎవరు పనిచేస్తున్నారు పార్టీ పట్ల జనంలో రియాక్షన్ ఎలా ఉంది ఇలాంటివి అన్నీ తెలుస్తాయని చెబుతున్నారు. మొత్తానికి జిల్లాల టూర్లు సక్సెస్ అవుతున్నా ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది కాబట్టి ముందు వైసీపీ పటిష్టతోతో పాటు క్యాడర్ మాట వింటే కనుక ఫ్యాన్ గిర్రున తిరిగే వీలు ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ అధినాయకత్వం ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటో.