Hot Posts

6/recent/ticker-posts

జ‌నాభా పెంపు.. మంచా-చెడా.. బాబు వ్యూహ‌మేంటి ..!


రాష్ట్రంలో జనాభాను పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతున్నారు

ANDHRAPRADESH:రాష్ట్రంలో జనాభాను పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. జనాభాను పెంచేందుకు సంబంధించి ప్రత్యేక విధానాన్ని కూడా తీసుకొస్తానని తాజాగా ఆయన ప్రకటించారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు జనాభా పెంపుదలకు సంబంధించి ప్రకటన చేశారు. జనాభా విధానానికి సంబంధించి ఒక ప్రత్యేక పాలసీని కూడా తీసుకొస్తానని చెప్పుకొ చ్చారు. గతంలో తానే ఒక్కరు చాలు అని ప్రకటించానని, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనాభా మరింత పెరగాల్సిన అవసరం ఉందని, అందుకే ఇప్పుడు ఇద్దరి నుంచి నలుగురు పిల్లల వరకు కనాలని ప్రతి కుటుంబానికి సూచిస్తున్నాన‌ని కూడా ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం నుంచి రాయితీలు, ఉద్యోగాలు సహా ఇతర ఉపాధులు, ఆర్థిక అంశాలను కూడా ప్రభుత్వం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఆయా కుటుంబాలకు మేలు చేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే, దేశంలో ఇప్పటికే 140 కోట్ల మందికి పైగా ప్రజల ఉన్న నేప‌థ్యంలో ఇలా జనాభాను పెంచుకోవడం వల్ల రాష్ట్రానికి జరిగే మేలు ఏమిటి? అనేది ప్రధాన ప్రశ్న. నిజంగానే జనాభా పెరిగితే రాష్ట్రానికి మేలు జరుగుతుందా? అలాంటప్పుడు గతంలో జనాభాను ఎందుకు తగ్గించాలని పిలిపించారు? అనే అంశంపై విస్తృతమైన చర్చ రాజకీయ వర్గాల్లోనే కాదు మేధావి వర్గాల్లో కూడా సాగుతోంది.

ప్రస్తుతం చంద్రబాబు చెబుతున్నట్టుగా జనాభా పెరిగితే వారికి ఆహార ధాన్యాలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు కల్పనా వంటివి భవిష్యత్తురాలకు ఇబ్బందికరంగా మారతాయి. కేంద్రం నుంచి వస్తున్న పన్నుల వాటాల‌ను పెంచుకునేందుకు, జనాభా పెంచేందుకు దక్షిణాది రాష్ట్రాల ప్రయత్నం చేస్తున్నాయి అన్నది విశ్లేష‌కుల‌ వాదన. కానీ ప్రభుత్వ విధానాలు మారితే.. అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గనక మారి.. తన విధానాలు మార్చుకున్నట్లు అయితే అప్పుడు పరిస్థితి ఏంటి? అనేది మరో ప్రశ్న. ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతం కాదు. నాయకులు ఎప్పుడూ శాశ్వతం కాదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. విధానాలు కూడా మారిపోతూ ఉంటాయి.

కాబట్టి, జనాభా పెరుగుదల విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిందే తప్ప.. జనాభా పెరిగితే ఏదో జరిగిపోతుందని ఆశించడం వల్ల ప్రయోజనాలు లేదన్నది ప్రొఫెసర్లు, మేధావులు చెబుతున్న మాట. ఏదేమైనా ప్రస్తుతం చంద్రబాబు చేసిన ప్రకటన దీనికి సంబంధించిన అంశాలపై మాత్రం ప్రజల్లో విస్తృతస్థాయి చర్చ జరుగుతుంది. ఇప్పటికి కూడా చాలా కుటుంబాల్లో అధికంగా పిల్లలు ఉన్నటువంటి వారు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, దిగువ మధ్య తరగతి కుటుంబాలు కావచ్చు. అధికంగా పిల్లలు ఉన్న కుటుంబాలు మాత్రం.. ఇబ్బందులను ఎదుర్కొంటున్న మాట వాస్తవం. దీనిని బట్టి జనాభా విధానం పై ప్రభుత్వ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నానేది చూడాలి. ప్ర‌స్తుతం అయితే..చంద్ర‌బాబు జ‌నాభా పెంపుపైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టారు.