ఏపీ రాజధాని అమరావతి గ్రాండ్ గా స్టార్ట్ చేస్తున్నారు. బిగ్ స్కేల్ మీద డిజైన్లు రూపొందిస్తున్నారు.
ANDHRAPRADESH,AMRAVATHI:ఏపీ రాజధాని అమరావతి గ్రాండ్ గా స్టార్ట్ చేస్తున్నారు. బిగ్ స్కేల్ మీద డిజైన్లు రూపొందిస్తున్నారు. ప్రపంచ రాజధానిగా అమరావతి ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారు. అయితే అమరావతి కోసం ఐకానిక్ టవర్స్ నిర్మించాలని లేక రాజధానికి వరల్డ్ క్లాస్ లుక్ రావాలంటే రూపాయికి పది రూపాయలు ఖర్చు పెడితేనే అయ్యేది.
ఉదాహరణకు హైకోర్టు భవనాల నిర్మాణాలకే ఏకంగా 11 వందల కోట్ల దాకా అవుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఏపీ లెజిస్లేటివ్ కాంప్లెక్స్ కోసం 600 కోట్లు ఖర్చు అవుతాయని లెక్క వేస్తున్నారు. అమరావతిలో నీరుకొండ వద్ద ఆరు వందల అడుగుల ఎత్తున ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దాని కోసం ఏకంగా మరో 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు.
అమరావతిలోని ఐకానిక్ వంతెన నిర్మాణం కోసం 2600 కోట్ల దాకా అవుతుందట. అలాగే ఇంటర్నల్ రింగ్ రోడ్డు కోసం 8,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని కూడా లెక్క వేస్తున్నారు. ఇవన్నీ అమరావతికి అవసరమైనవే. పైగా అద్భుత కట్టడాలుగా చిరస్థాయిగా ఉండాలంటే ఈ కట్టడాలు అవసరం అని అంటున్నారు.
మరో వైపు ఇవి కాకుండా అమారవతిలో ఇరవై నుంచి పాతిక దాకా భారీ మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నారు. అవి కూడా వేల కోట్లతో రూపొందిస్తున్నవే. వాటి అంచనాలు కూడా భారీ ఎత్తున ఉన్నాయి. వాటికి ఇప్పటిదాకా నిధుల కొరత కారణంగా పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయలేదని అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచ బ్యాక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కలసి అమరావతి కోసం అప్పులు ఇస్తున్నాయి. అయితే విడతల వారీగా ఈ నిధులు వస్తాయి. ఇక ప్రపంచ బ్యాంక్ బృందాలు తాజాగా వచ్చి అన్నీ పరిశీలించి వెళ్ళాయి. ఇంకో వైపు చూస్తే ఈ రెండు బ్యాంకులు ఇస్తున్న రుణాలు సరిపోవు అంటున్నారు పైగా ఈ రుణాలకు వడ్డీలు కూడా అధికం అవుతాయని అంటున్నారు.
ఇంకో వైపు సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ గా అమరావతిని మార్చాలంటే ముందుగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి. అంతే కాదు కీలక కట్టడాలు అన్నీ ప్రభుత్వమే పూర్తి చేయాలి. 2028 అన్నది తొలిదశ అమరావతి పనుల పూర్తికి పెట్టుకున్నారు. ఇలా చూస్తే కనుక మొదట తీసుకున్న 33 వేల ఎకరాలా భూములలో వరదలను అడ్డుకునేందుకు నిర్మాణాలు, అలాగే రిజర్వాయర్ల నిర్మాణాలు ఇతరత్రా కట్టడాలు చేపట్టాల్సి ఉంది, వాటికి చాలా భూములు పోతాయని అంటున్నారు.
Social Plugin