Hot Posts

6/recent/ticker-posts

తూర్పుకు తిరిగిన ప‌శ్చిమ పాలిటిక్స్‌..!


ఈ క్ర‌మంలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాలిటిక్స్‌ను ప‌రిశీలిస్తే.. ఇక్క‌డంతా ఎవ‌ర‌కి వారుగా రాజ‌కీయాలు చేసుకుంటున్న‌ట్టు స్ప‌ష్ట‌మైంది.

ANDHRAPRADESH:రాజ‌కీయాల్లో ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ర‌కంగా ఉంది. ఒక జిల్లాలో రాజ‌కీయాల‌ను మ‌రో జిల్లాతో పోల్చి చూడ లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇలానే కీల‌క‌మైన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాలిటిక్స్ కూడా ఉన్నాయ‌ని ప‌రిశీల కులు చెబుతున్నారు. కొన్నాళ్ల కింద‌ట‌.. కూట‌మి ప్ర‌భుత్వం ఏడాది పాల‌న పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వ‌, నాయ‌కుల ప‌నితీరుపై రెండు మూడు స‌ర్వేలు వ‌చ్చాయి. ఈ స‌ర్వేల్లో జిల్లాల వారీగా ప‌నితీరును అంచ‌నా వేశారు. మంత్రులు, నాయ‌కులు ఎలా ఉన్నార‌న్న‌ది ప‌రిశీల‌న చేశారు.

ఈ క్ర‌మంలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాలిటిక్స్‌ను ప‌రిశీలిస్తే.. ఇక్క‌డంతా ఎవ‌ర‌కి వారుగా రాజ‌కీయాలు చేసుకుంటున్న‌ట్టు స్ప‌ష్ట‌మైంది. మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన విజ‌యం ద‌క్కించుకుంది. ఒక‌ప్పు డు బీజేపీ హవా సాగిన తాడేప‌ల్లి గూడెంలో గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన విజ‌యం ద‌క్కించుకుంది. అలానే.. కొత్త గా పార్టీలోకి వ‌చ్చిన వారి కోసం.. టీడీపీ నాయ‌కులు టికెట్ల‌ను త్యాగం చేశారు. అయితే.. ఇలా త్యాగాలు చేసిన వారిని గెలిచిన వారు ప‌ట్టించుకోక‌పోవ‌డం.. ఒక చ‌ర్చ అయితే, గెలిచిన వారు కూడా.. ప్ర‌జ‌ల కోసం కాకుండా.. రాజ‌కీయాల కోసం ప‌నిచేస్తున్నార‌న్న‌ది మ‌రో టాక్‌.

ఇక‌, ప్ర‌ధానంగా కూట‌మి నాయ‌కుల్లోనే క‌లివిడి లేక‌పోవ‌డం. ప‌శ్చిమ రాజ‌కీయాల‌ను ప్ర‌భావ‌వంతం చే స్తోంద‌ని స‌ర్వే రిపోర్టులు తేల్చి చెప్పాయి. అంతేకాదు.. మెజారిటి సిట్టింగు నాయ‌కుల‌కు టికెట్లు ఇస్తే.. ఓడిపోయే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నా వేసిందికూడా ఎక్కువ‌గా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాపైనే కావ‌డం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం క‌లివిడి లేని నాయ‌కులు, ఒక‌రితో ఒక‌రికి పొస‌గ‌ని ప‌నితీరు.. వంటివే. దీనికి అన్ని నియోజ‌క‌వ‌ర్గాలూ.. ఉదాహ‌ర‌ణ‌లే. తాడేప‌ల్లి గూడెం ఎమ్మెల్యే.. ఇత‌ర నాయ‌కుల‌తో క‌ల‌వ‌డం లేదు.