తాజాగా నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
ANDHRAPRADESH:తాజాగా నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇందులో 26/11 కసబ్ కేసు ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిగమ్ తో పాటు హర్షవర్ధన్, సదానందన్, మీనాక్షి జైన్ లను రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(ఏ) ద్వారా సంక్రమించిన అధికారాల ప్రకారం భారత రాష్ట్రపతి రాజ్యసభకు నలుగురు ప్రముఖ వ్యక్తులను నామినేట్ చేశారు.
అవును... గతంలో నామినేట్ చేయబడిన సభ్యుల పదవీ విరమణ కారణంగా మిగిలిన రాజ్యసభ ఖాళీలను తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ భర్తీ చేశారు. వీరిలో ముంబైకి చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ దేవ్ రావ్ నికమ్, కేరళకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సీ సందానందన్ మాస్తే, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, ప్రముఖ చరిత్రకారిణి మీనాక్షి జైన్ ఉన్నారు.
ఉజ్వల్ దేవ్ రావ్ నికమ్:
26/11 ముంబై ఉగ్రవాద దాడుల విచారణ, పలు హై ప్రొఫైల్ క్రిమినల్ కేసులలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ప్రసిద్ధి చెందారు. ఈ క్రమంలో... 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముంబై నార్త్ సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గం నుండి బీజేపీ తరుపున పోటీ చేశారు. అయితే.. కాంగ్రెస్ అభ్యర్థి వర్ష గైక్వాడ్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.
సి సదానందన్ మాస్టర్:
కేరళకు చెందిన సి సదానందన్ మాస్టర్.. అనుభవజ్ఞుడైన ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త. ఇదే సమయంలో చాలా కాలంగా బీజేపీతో అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అదేవిధంగా... 1994లో పెరిన్చేరి గ్రామం సమీపంలో సీపీఐ(ఎం) కార్యకర్తల దాడిలో తన రెండు కాళ్ళను నరికివేశారని ఆరోపించబడినప్పుడు జరిగిన రాజకీయ హింస నుండి బయటపడిన విషయంలోనూ ఆయన ప్రసిద్ధి చెందారు!
హర్ష్ వర్ధన్ శ్రింగ్లా:
మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా.. అమెరికా, బంగ్లాదేశ్, థాయిలాండ్ లకు రాయబారితో సహా కీలక దౌత్య పదవులను నిర్వహించారు. ఇదే సమయంలో... 2023లో భారతదేశంలో జరిగిన జీ20 సదస్సుకు చీఫ్ కోఆర్డినేటర్ గా కూడా పనిచేశారు.
డాక్టర్ మీనాక్షి జైన్:
ఢిల్లీ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఒక మహిళా కళాశాల 'గార్గి'లో ప్రముఖ చరిత్రకారిణి, మాజీ హిస్టరీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మీనాక్షి జైన్ కూడా ఉన్నారు. భారతీయ చరిత్ర రంగంలో జైన్ చేసిన కృషి, విద్యా రంగానికి ఆమె చేసిన కృషి విస్తృతంగా గుర్తింపు పొందాయి!
ఏపీలో ఎవరూ లేరా?:
ఆ సంగతి అలా ఉంటే... ఈ సందర్భంగా రాష్ట్రపతి నామినేటి చేసిన రాజ్యసభ సభ్యుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరూ లేకపోవడంతో ఓ చర్చ తెరపైకి వచ్చిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందరో ప్రముఖులు ఉన్నప్పటికీ వారికి ఎందుకు ఆ అవకాశం దక్కలేదు అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారని అంటున్నారు!
రాష్ట్రపతి నామినేట్ చేసే రాజ్యసభ సభ్యుల విషయంలో నిర్ణయం పూర్తిగా ఫస్ట్ సిటిజన్ దే అయినప్పటికీ... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దల సలహాలు, సూచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండి ఉంటుంది కదా? అలాంటప్పుడు.. కేంద్రంలో బీజేపీ ఎప్పుడు అధికారంలో ఉన్న ఏపీ పాత్ర కీలకంగా ఉంటున్న వేళ.. ప్రధానంగా 2024 లో ఈ పాత్ర మరింత కీలకంగా ఉన్న నేపథ్యంలో అయినా.. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఆంధ్రులు కనిపించలేదా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు!
ఏది ఏమైనా... అవకాశం ఉన్న ప్రతీ చోట ఆంధ్రులకు న్యాయం చేయాల్సిన బాధ్యత, వారిని వీలైనంత ఎక్కువగా గౌరవించుకోవాల్సిన అవసరం బీజేపీ పెద్దలకు ఉందని పలువురు గుర్తు చేస్తున్నారని అంటున్నారు. యూజ్ అండ్ త్రో పద్దతిలో ఏపీ ప్రజలను చూసే ఆలోచన ఉండొద్దని సూచిస్తున్నారని తెలుస్తోంది!!
Social Plugin