ANDHRAPRADESH:ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో ఉన్న పార్టీలు పొత్తు లు కొనసాగిస్తూనే రాజకీయంగా తమ బలం పెంచుకోవటం పైన ఫోకస్ చేసాయి. జనసేన కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. కేంద్రంలోనూ.. రాష్ట్రంలోనూ తమ ప్రాతినిధ్యం పెరగాలనే విధంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కీలక మంత్రాంగం సాగుతోంది. ఇదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు కు మంత్రి పదవి విషయంలో పవన్ కీలక అంశాలను వెల్లడించారు. దీంతో, నెక్స్ట్ ఏం జరుగుతుందనేది కీలకంగా మారుతోంది.
కీలక పరిణామాలు
డిప్యూటీ సీఎం పవన్ తన సోదరుడు నాగబాబు మంత్రి పదవి పైన కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ బలోపేతం పైన తన ఆలోచనలను బయట పెట్టారు. ప్రస్తుతం తాను చేస్తున్న రెండు సినిమాల షూటింగ్ త్వరలో ముగియనుందని చెప్పారు. ఆ తరువాత మంత్రిగా ప్రభుత్వంలో.. పార్టీ బలో పేతం కోసం పూర్తి సమయం కేటాయిస్తానని వెల్లడించారు. ఆగస్టు తరువాత ఈ మేరకు ప్రణాళిక లు ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం పని తీరు బాగుందని.. ఏడాది కాలంలోనే ఎన్నో మార్పులు తీసుకొచ్చామని వివరించారు. ఈ టైం లో సినిమాలు తాను తీయడం కష్టమని.. ఇక నుంచి సినిమాల నిర్మాణం మీద దృష్టి పెడతానని పవన్ స్పష్టం చేసారు.
తేల్చేసిన పవన్
ఇక తనకు రాజకీయాలే ముఖ్యమని పవన్ తేల్చి చెప్పారు. అదే విధంగా.. నాగబాబు కేబినెట్ రావాలా? వద్దా? అనే నిర్ణయం నా దగ్గరే ఆగిపోయిందని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. నాగబాబు కు రాజ్యసభ అవకాశం దక్కక పోవటంతో ఆయన్ను కేబినెట్ లో అవకాశం కల్పిస్తామని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఆ తరువాత నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు మంత్రులు ఉంటే రాజకీయంగా విమర్శలు వస్తాయనే అంశం పైన గతంలో పవన్ స్పష్టత ఇచ్చారు. నాగబాబు పార్టీ కోసం కష్టపడ్డారని.. పదవుల్లో ఇతర అంశాలను తాను ప్రాతిపదిక గా తీసుకోవటం లేదని.. పని చేసిన వారికి గుర్తింపు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పటి వరకు నాగబాబుకు మంత్రి పదవి దక్కకపోవటం పైన చర్చ జరుగుతోంది.
పవన్ నిర్ణయం వెనుక
కాగా, పవన్ ఇప్పుడు ఇది తన వద్దే నిర్ణయం ఆగిపోయిందని చెప్పటం ఆసక్తి కరంగా మారుతోంది. నాగబాబును రాష్ట్ర కేబినెట్లోకి తీసుకురావటం వెనుక పవన్ ఎందుకు సంకోచిస్తున్నారనేది పార్టీ నేతల్లో చర్చ మొదలైంది. తాను డిప్యూటీ సీఎంగా ఉండగా.. నాగబాబును ఢిల్లీకి రాజ్యసభకు పంపే ప్రతిపాదన పరిశీలనలో ఉందని పార్టీ నేతల సమాచారం. అయితే, ఇప్పుడు ఎమ్మెల్సీ చేసిన నాగబాబును.. తిరిగి రాజ్యసభకు పంపాలంటే పొత్తుల లెక్కల్లో సులభమైన అంశం కాదనే వాదన ఉంది. అయితే, వచ్చే నెలలో ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని చెబుతున్నారు. ఈ లోగా పవన్ నాగబాబు విషయంలో తీసుకునే నిర్ణయం కీలకం కానుంది
Social Plugin