ANDHRAPRADESH:రైల్వే అధికారులు కీలక ప్రకటన చేసారు. తెలుగు రాష్ట్రాల మీదుగా తిరువనంతపురం వెళ్లే శబరి ఎక్స్ ప్రెస్ ను అప్ గ్రేడ్ చేయటంతో పాటుగా కొత్త నెంబర్ కేటాయించారు. అదే విధంగా ఈ రైలు ప్రయాణించే వేళలను మార్పు చేసారు. కొత్త ప్రయాణ వేళలను ప్రకటించారు. రూట్ లో ఎలాంటి మార్పులు లేకపోయినా.. సమయం మార్పు అమల్లోకి రానుంది. ఈ కొత్త వేళలు సెప్టెంబర్ 29 నుంచి అమలు చేయనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
సికింద్రాబాద్ - తిరువనంతపురం - సికింద్రా బాద్ మధ్య నడిచే శబరి ఎక్స్ ప్రెస్ పైన కీలక ప్రక టన చేసారు. అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్య లో వినియోగించుకునే ఈ రైలుకు.. నిత్యం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పడు ఈ రైలు నిర్వహణ తో పాటుగా ప్రయాణ వేళలు మార్పు చేసారు. సికింద్రాబాద్ - తిరువనంతపురం - సికింద్రాబాద్ (17229/17230) శబరి ఎక్స్ ప్రెస్ ను ఇక నుంచి సూపర్ ఫాస్ట్ గా మార్పు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రైలుకు ఉన్న డిమాండ్ తో రైల్వే శాఖ శబరి ఎక్స్ ప్రెస్ ను ఇక నుంచి సూపర్ ఫాస్ట్ గా మారుస్తూ తాజాగా రైల్వో బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ రైలుకు కొత్త నెంబర్లు (20630/20629) కేటాయించారు. అదే విధంగా ప్రయాణ వేళలు మా
17229 తిరువనంతపురం - సికింద్రాబాద్ రైలు కొత్త నెంబర్ తో తిరువనంతపురం లో సాయంత్రం 6.45కి బయలు దేరి తిరుపతికి రాత్రి 11.15కి చేరుతుంది. వేకువ జామున 4.08 గంటలకు చీరాల, 4.23 గంటలకు బాపట్ల, 4.58 గంటలకు నిడుబ్రోలు, 5.28 గంటలకు తెనాలి, 6.20 గంటలకు గుంటూరు, 7.09 కి సత్తెనపల్లి, 7.34 గంటలకు పిడుగు రాళ్ల, 7.54 గంటలకు నడికూడి, 10.29 కి చర్లపల్లి, 11 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. అదే విధంగా సికింద్రాబాద్ - తిరువనంత పురం శబరి ఎక్స్ ప్రెస్ మధ్నాహ్నం 2.25 గంటలకు బయల్దేరి సాయంత్రం 5.19కి నడికూడి, 5.39 కి పిడుగురాళ్ల, 6.14కి సత్తెనపల్లి, 6.50కి గుంటూరు చేరుతుంది.
రాత్రి 7.48కి తెనాలి, 8.03కి నిడుబ్రోలు,8.23 కి బాపట్ల, 8.38 కి చీరాల, అర్ద్రరాత్రి దాటాక 1.33 కి తిరుపతి, మరుసటి రోజు సాయంత్రం 6.20 కి తరువనంత పురం చేరుకుంటుంది. ఇక నుంచి రిజర్వేషన్ చేయించుకునే ప్రయాణీకులకు వెసులుబాటు కోసం సెప్టెంబర్ 29 నుంచి అమలు చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు
Social Plugin