హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గురించి తెలంగాణలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
HYDERABAD:హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గురించి తెలంగాణలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నికలకు ముందు నుంచి ఎన్నికల తర్వాత కూడా వివాదాలతోనే సహవాసం చేస్తుంటారు పాడి. గత తాజా మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నియోజకవర్గాన్ని వీడినప్పటి నుంచి కౌశిక్ రెడ్డిది ఆడిందే ఆట.. పాడిందే పాట..గా మారిపోయింది. మల్కాజ్‌గిరికి ఈటల వెళ్లడంతో హుజూరాబాద్ నియోజకవర్గంపై పట్టు తగ్గింది. ఈ నేపథ్యంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల భారీ పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. తాను ఓడిపోతే ‘భార్య, పిల్లలతో సహా సూసైడ్ చేసుకుంటా’ అని ఎన్నికల ప్రచారంలో చెప్పడం తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రజలు కౌశిక్ రెడ్డికి ఓటు వేసి గెలిపించారు. ఆ తర్వాత ఈ విషయమై ఎన్నికల కమిషన్ ఆయనపై కేసు నమోదు చేసింది.
2023 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి విజృంభించడం మొదలు పెట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో సైతం సభలో వీరంగం సృష్టించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పక్షం నేతలు ఆయన నోటికి కళ్లెం వేశారు. నియోజకవర్గంలో కూడా ఒకటి రెండు పెద్ద కేసుల్లో ఇరుకున్నారు పాడి. ఈటల రాజేందర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి చేశారంటూ కేసు నమోదైంది. ఆ సందర్భంలో ఆయన ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండాల్సి వచ్చింది. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు, సీఎంపై తూలనాడడంతో కూడా కేసులు నమోదయ్యాయి. ఇక ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేగాయి.
సీఎం రేవంత్ రెడ్డిపై శుక్రవారం (జూలై 25) రోజున తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ నుంచే వచ్చానని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వ్యక్తిగత వివరాలు బయటపెడతానని కౌశిక్ రెడ్డి రేవంత్ ను హెచ్చరించారు. నువు ఎవరితో తిరిగావు.. ఢిల్లీ, దుబాయ్ లో ఎక్కడెక్కడ ఉన్నావు.. అన్నీ తెలుసు అన్నారు. మిస్ వరల్డ్ పోటీకి వచ్చిన యువతుల ఫోన్లు ట్యాప్ చేయించాడని ఆరోపణలు చేశాడు. ఇలా మాట్లాడడమే కాకుండా వీటికి సంబంధించి పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని పాడి చెప్పాడు. తన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారని విమర్శించాడు.
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు కామనే.. కానీ అవి ప్రజలకు మేలు చేసేవిగా ఉండాలి. కానీ పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం సృతిమించుతోందని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే రంగారెడ్డి, హైదరాబాద్ కు చెందిన కొన్ని పోలీస్ స్టేషన్లలో పాడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక ఆయన ఇంటి ముట్టడికి కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు పోలీసులు శనివారం (జైలై 26) భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్ఎస్ యూఐ పిలుపు కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహంతో పట్నంలో పరిస్థితులు భారీ వర్షాలల్లో కూడా వేడెక్కాయి.
Social Plugin