ANDHRAPRADESH:అలాగే సీనియర్ మంత్రులు కొందరు ఉన్నారు. అయితే ఎవరికీ పాలనా బాధ్యతలు అయితే అప్పగించలేదు. బాబు సింగపూర్ లో ఉంటూనే ఏపీ మీద ఒక కన్నేసి ఉంచారు.
టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ నెల 26న సింగపూర్ పర్యటనకు వెళ్ళారు. ఈ నెల 31 దాకా ఆయన అక్కడే ఉంటారు. సింగపూర్ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని వచ్చేందుకు బాబు కంకణం కట్టుకున్నారు. అందులో సింహ భాగం అమరావతి రాజధాని కోసమే అన్నది కూడా ఉంది. మొత్తానికి బాబు సింగపూర్ లో ఉన్నారు.
కీలక సమయంలో అక్కడే :
చంద్రబాబు కీలక సమయంలో సింగపూర్ లో ఉన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి హోదాలో నారా లోకేష్ కూడా వెళ్ళారు. అలాగే భారీ పరిశ్రమల మంత్రిగా ఉన్న టీజీ వెంకటేష్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సైతం ఈ బృందంలో ఉన్నారు. అంటే బాబు ముగ్గురు మంత్రులతో పాటు తన సింగపూర్ పర్యటనను కొనసాగిస్తున్నారు. ఇక మిగిలిన మంత్రులు ఎవరూ అంటే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. అలాగే సీనియర్ మంత్రులు కొందరు ఉన్నారు. అయితే ఎవరికీ పాలనా బాధ్యతలు అయితే అప్పగించలేదు. బాబు సింగపూర్ లో ఉంటూనే ఏపీ మీద ఒక కన్నేసి ఉంచారు.
స్టీరింగ్ ఆయన వద్దనే :
చంద్రబాబు వద్దనే స్టీరింగ్ ఉంది. ఆయన సింగపూర్ లో ఉన్నా కూడా టెక్నికల్ గా అన్నీ అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో అక్కడ నుంచే ఆయన పాలన సాగిస్తునారు. ఈ నెలాఖరు వరకూ ముఖ్యమంత్రి రారు. అయినా సరే ఏపీలో ఎపుడేమి జరుగుతుంది బాబు అన్నీ తెలుసుకుంటున్నారు. ఆయన పూర్తిగా సమాచారం తెప్పించుకుంటూనే ఉన్నారు. దాంతో బాబు ఏపీలో లేరు అన్నది ఎవరికీ లేకుండా పోతోంది అని అంటున్నారు.
గతంలో కూడా ఇదే తీరు :
ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో దావోస్ పర్యటనకు వెళ్ళారు. అది కూడా దాదాపుగా వారం రోజుల పాటు సాగింది. అపుడు సైతం ఆయన వెంట నారా లోకేష్ ఉన్నారు. అయినా ఏపీలో పాలన బాబు దావోస్ నుంచే సమీక్షిస్తూ వచ్చారు. అన్ని విషయాల మీద ఆయన అక్కడ నుంచి పర్యవేక్షిస్తూ వచ్చారు. దాంతో బాబు దావోస్ టూర్ సక్సెస్ ఫుల్ గా సాగింది. అదే సమయంలో ఏపీలో పాలన కూడా ఆయనే అన్నీ దూరం నుంచే చూసుకున్నారు.
నారా లోకేష్ ఉంటే కనుక :
అయితే నారా లోకేష్ కనుక ముఖ్యమంత్రితో పాటు విదేశీ పర్యటనకు వెళ్ళకపోయి ఉంటే కనుక కచ్చితంగా ఆయన పాలనాపరంగా మోనిటరింగ్ చేసేవారు అన్న మాట వినిపిస్తోంది. లోకేష్ టీడీపీలో బాబు తరువాత స్థానంలో ఉన్నారు. ఆ పార్టీకి భావి అధినేత, అలాగే భావి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. దాంతో లోకేష్ ఉంటే కనుక తప్పనిసరిగా పార్టీ వ్యవహారాలను అటు ప్రభుత్వ వ్యవహరాలను కూడా పర్యవేక్షించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
ఊహాగానాలకు చెక్ :
బాబు సింగపూర్ టూర్ నేపథ్యంలో బాధ్యతలను ఎవరికైనా అప్పగిస్తారా అన్నది చాలా రోజులుగా చర్చగా సాగుతూ వచ్చింది. ఒక దశలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు కూడా వినిపించింది. ఆయన కొన్ని రోజుల పాటు అయినా బాధ్యతలు చూస్తారు అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వచ్చారు. ఎవరు అలా స్టార్ట్ చేసారో కానీ అది వైరల్ గా మారింది. అయితే ఇపుడు చూస్తే రిమోట్ బాబు వద్దనే ఉంది. ఆయన సింగపూర్ నుంచే మొత్తం ఆపరేట్ చేస్తున్నారు. సో బాబు విదేశీ పర్యటనలు ఇక ముందు కూడా చేసే సందర్భాలు ఉన్నాయి. ఇలా ఎపుడు పర్యటనకు చేసినా ఎవరికో బాధ్యతలు ఇచ్చే విధానం మాత్రం లేదని ఉండరాదని ఆ తరహా ఊహాగానాలకు మొదట్లోనే చెక్ పెట్టేశారు అని అంటున్నారు.
Social Plugin