ANDHRAPRADESH:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తలు దాడి చేసిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న ప్రసన్న కుమార్ రెడ్డి.. విచారణకు హాజరయ్యారు.
ఈ నెల 7వ తేదీన కోవూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి చెందిన అనుచరులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వాళ్లు వీరంగం సృష్టించారు. ఫర్నిచర్ మొత్తాన్నీ ధ్వంసం చేశారు. ఇంట్లో ఏ వస్తువును కూడా మిగలనివ్వలేదు.
నెల్లూరు కొండయ్యపాలెం గేట్ అంబేద్కర్ భవన్ సమీపంలోని సుజాతమ్మ కాలనీలో నివసిస్తోన్నారు నల్లపరెడ్డి. దుండగులు ఆయన ఇంటిపై దాడికి దిగారు. ఇష్టానుసారంగా ప్రవర్తించారు. విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. అంతకు ముందు కోవూరులో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్నారు ప్రసన్నకుమార్ రెడ్డి.
ఆ సమావేశాన్ని ముగించుకుని తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై విమర్శలు చేశారని, దాని తరువాతే ఈ ఘటన జరిగినట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తోన్నారు.
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసగా ఆమె వర్గీయులు, అనుచరులు ఈ ఘోరానికి పాల్పడినట్లు చెబుతున్నారు. సమాచారం అందుకుని పోలీసులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకునే లోపే దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
ఇదే ఘటనలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి.. నల్లపరెడ్డిపై ఎదురు కేసు పెట్టారు. ఈ కేసులో తాజాగా విచారణ నిమిత్తం నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు ప్రసన్నకుమార్ రెడ్డి హాజరయ్యారు. తన న్యాయవాదులతో విచారణకు హాజరైన ప్రసన్న కుమార్ రెడ్డి పోలీసులు పలు ప్రశ్నలు సంధించగా వాటికి సమాధానం ఇచ్చారు.
ఈ కేసులో స్టేషన్ బెయిల్ మంజూరుకు ఆయన తరఫు న్యాయవాదులు ష్యూరిటీ ప్రొడ్యూస్ చేశారు. ఈ ఘటనపై అదే రోజు అర్ధరాత్రి ప్రసన్న అనుమానితుల పేర్లను ఊటంకిస్తూ వేమిరెడ్డి దంపతులు తనను హత్య చేయించేందుకు పథకం పన్నారని నగర డీఎస్పీ పీ సింధుప్రియకు ఫిర్యాదు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి.
ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. దర్గామిట్ట పోలీసులు జీడీ ఎంట్రీతో సరి పెట్టారని ప్రసన్న ఆరోపించారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసు అధికారులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేస్తున్నారని విమర్శించార.
మరోవైపు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఫిర్యాదు మేరకు ప్రసన్నపై పోలీసులు విచారణ మొదలుపెట్టడం పట్ల వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసన్న ఇంటిపై దాడికి పాల్పడినట్లు 60 మందిని గుర్తించినా, ఇంతవరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పోలీసుల తీరుపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు.
Social Plugin