VISAKHAPATNAM:రైల్వే అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. విశాఖ నగర శివార్లలో తాడి- దువ్వాడ స్టేషన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్.. ట్రాక్ పునరుద్దరణ పనుల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా విశాఖ మీదుగా నడిచే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణీకుల డిమాండ్ కు అనుగుణంగా అదనపు కోచ్ లు ఏర్పాటు చేసారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న పలు రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ట్రాక్ పునరుద్దరణ పనుల్లో భాగంగా ఈ నెల 26,28,30 తేదీల్లో విశాఖ - విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12717), విజయవాడ - విశాఖ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12718), రాజమండ్రి - విశాఖ మెము ప్యాసింజర్ (67285), విశాఖ - రాజమండ్రి మెము ప్యాసింజర్ (67286), కాకినాడ - విశాఖ మెము ప్యాసింజర్ (17267), విశాఖ కాకినాడ మెము ప్యాసింజర్ (17268) అదే విధంగా ఈ నెల 26,30 తేదీల్లో గుంటూరు - విశాఖ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22875) రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో సెప్టెంబరు చివరి వారం నుంచి హైదరాబాద్-సీఎస్టీ ముంబై, సికింద్రాబాద్-భువనేశ్వర్ మధ్య నడిచే రైళ్లకు అదనంగా రెండేసి స్లీపర్ కోచ్‌లను జత చేయనున్నట్టు ప్రకటించారు.
ఇక, కాచిగూడ-మైసూరు ఎక్స్‌ప్రెస్‌రైలు (12785, 12786)ను అశోకపురం వరకు పొడిగిస్తున్న ట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కాచిగూడ- మైసూరు-కాచిగూడ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు ఇక నుంచి కాచిగూడ-అశోకపురం-కాచిగూడ మధ్య నడపడానికి రైల్వే బోర్డు అనుమతించింది. కాగా, సెప్టెంబరు 23 నుంచి హైదరాబాద్-సీఎస్టీ ముంబై (22731), 26 నుంచి సీఎస్టీ ముంబై-హైదరాబాద్ (22732), 24 నుంచి సీఎస్టీ ముంబై-హైద రాబాద్ (12701), 25 నుంచి హైదరాబాద్-సీఎస్టీ ముంబై(12702) రైళ్లకు అదనంగా రెండు స్లీపర్ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. 23 నుంచి సికింద్రాబాద్-భువనేశ్వర్ (17016), 25 నుంచి భువనేశ్వర్-సికింద్రాబాద్ (17015) రైళ్లకు అదనంగా మూడు స్లీపర్ కోచ్‌లను జత చేయనున్నట్టు పేర్కొన్నారు.
Social Plugin