Hot Posts

6/recent/ticker-posts

కొత్త పెన్షన్ల మంజూరు పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!


ANDHRAPRADESH:ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ 4 వేలకు పెంచిన పెన్షన్ ప్రతీ నెల ఒకటో తేదీన ఇంటి వద్దనే అందిస్తోంది. కాగా, కొంత కాలంగా అర్హులైన లబ్దిదారులు పెన్షన్ మంజూరు కోసం వేచి చూస్తున్నారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సమయంలోనే కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. కాగా, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇప్పుడు కొత్త పెన్షన్ల పంపిణీ పైన తాజాగా ప్రకటన చేసారు.

పెన్షన్లు మంజూరు

పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు వీలైనంత త్వరగా పెన్షన్‌ ఇచ్చే విధానాన్ని తమ ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. 1,09,155 మంది కొత్తగా పెన్షన్‌ పొందేందుకు అర్హత సాధించారని చెప్పుకొచ్చారు. ఆగస్టు నుంచి కొత్తగా వారందరికీ స్పౌజ్‌ కేటగిరీలో వితంతు పెన్షన్‌ మంజూరుకు విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీని కోసం ప్రతి నెలా రూ.43.66 కోట్లు అదనంగా ప్రభుత్వం ఖర్చు చేయనుందని మంత్రి వెల్లడిం చారు. కాగా, 2014- 19 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ నమోదు ప్రక్రియ నిరంతరాయంగా జరిగేది. లబ్ధిదారులు వారంలో ఏ రోజైన సరే పెన్షను దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది.

వీరికి పంపిణీ

ఆ సమయంలో అధికారులు వాటిని ఏ వారానికి ఆ వారం పరిశీలించి నెలాఖరుకు పెన్షన్ జాబితాను సిద్ధం చేసేవారు. అనర్హులకి తొలగింపు పెన్షన్ల మంజూరు సమయంలోనూ అనర్హులను తెలిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్‌ సదరం ధ్రువీక రణ పత్రాలు కోకొల్లలుగా జారీ అయ్యాయి. ఒక్కో దానికి రూ.30 వేల వరకు వసూలు చేశారు. కూట మి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరుకు ముందే వాటిని రీ అసెస్‌మెంట్‌ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందాలను నియమించి వాటిని తనిఖీ చేయిస్తోంది. స్పౌజ్ పింఛ‌న్ల కోసం నేటి నుంచి దరఖాస్తులు అన్ని వార్డు, గ్రామ సచివాలయాల్లో స్వీకరించారు. అర్హుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. వెరిఫికేషన్ దాదాపు పూర్తయింది.

వచ్చే నెల నుంచి

ఈ మేరకు అనర్హులను తెలిగించి.. అర్హులైన వారికి పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించారు. కాగా, తాజా నిర్ణ‌యంతో ప్ర‌భుత్వంపై నెల‌కు రూ. 35.91కోట్ల అద‌న‌పు భారం ప‌డ‌నుంది. ఆగస్టు నెల నుంచి కొత్త పింఛన్ల మంజూరు చేసేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించింది. ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదించనుంది. అనంతరం ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోనుంది. కొత్తగా వివిధ కేటగిరీల కింద దాదాపు 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఒక కేటగిరీ విషయంలో తీసుకున్న నిర్ణయంతో మిగిలిన వారి విషయంలోనూ సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నారు.