ANDHRAPRADESH:శ్రీశైలం భక్తులకు బిగ్ అలర్ట్. వారాంతం కావటంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులు.. ప్రాజెక్టు చూసేందుకు వస్తున్న భక్తులతో ఆ మార్గం పూర్తి రద్దీగా మారింది. దాదాపు పది కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. శ్రీశైలం ఆలయంలో స్పర్శ దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో శ్రీశైలం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో, ఈ రోజు రేపు.. ఇదే విధంగా రద్దీ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
శ్రీశైలం మార్గం పూర్తిగా రద్దీగా మారింది. శ్రీశైలం ఆలయ సందర్శనతో పాటుగా తాజాగా ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్రాబాద్ మండలం పాతాళగంగ నుంచి దోమలపెంట చెక్ పోస్టువరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. హైవేపై 10 కి.మీ మేర వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్డు కావడంతో వాహనాల రద్దీ ఎక్కువైతే ప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా ఉంది. దీంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. శ్రీశైలం ఆలయం లో కొద్ది రోజుల క్రితం మొదలైన స్పర్శ దర్శనం తో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
శ్రీశైల మహాక్షేత్రంలో కొలువుదీరిన మల్లికార్జునస్వామిని తమ చేతులతో తాకుతూ 'స్పర్శ దర్శనం' చేసుకోవడం ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తారు భక్తులు. గత ఆరు నెలలుగా ఆగిపోయిన ఉచిత స్పర్శ దర్శనాన్ని జులై 1వ తేదీ నుంచి పునఃప్రారంభించింది. ఈ దర్శనానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన రావడంతో రద్దీ కూడా అదే స్థాయిలో ఉంది. దీంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు "ఉచిత స్పర్శ దర్శనం" టోకెన్ల జారీకి ఆన్‌లైన్ విధానం ప్రవేశ పెట్టారు. శ్రీశైలంలో కొలువైన మల్లన్న స్వామి ఉచిత స్పర్శ దర్శనాన్ని వారంలో మంగళ వారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 నుంచి 3.45 గంటల వరకు కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఆన్ లైన్ విధానంలోనూ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. www.srisailadevasthanam.org, www.aptemples.ap.gov.in అనే రెండు వెబ్‌సైట్‌ల ద్వారా పొందాల్సి
Social Plugin