ANDHRAPRADESH:మహిళా పొదుపు సంఘాలకు పోటీగా పురుష పొదుపు సంఘాలు వచ్చేసాయి. ప్రభుత్వం మహిళా సంఘాలతో పాటుగా పురుష సంఘాలకు రుణ సౌకర్యం కల్పిస్తోంది. అసంఘటిత కార్మికులతో సంఘాలు ఏర్పాటు చేసి, వారికి రుణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. తద్వారా వారికి ఆదాయ మార్గాలను చూపించటమే అసలు లక్ష్యం. కాగా, ఇప్పుడు ఏపీలోని కోనసీమ జిల్లాలో ఈ మార్గంలో అమలు చేస్తున్న విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది.
ప్రభుత్వం మహిళా సంఘాల తరహాలోనే పురుష పొదుపు సంఘాల ఏర్పాటుకు నిర్ణయించింది. పట్టణాల్లో జీవించే అసంఘటిత కార్మికులతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసేందుకు పట్టణంలో ని భవన నిర్మాణ రంగం, రిక్షా కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, కేర్ టేకర్లు, వృత్తి పనివారు, ఏసీ, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్ నిపుణులు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, సెలూన్ నిర్వా హకులు వంటి వివిధ రకాల పనులు చేసే వారిని మెప్మా ఆర్పీల ద్వారా గుర్తించారు. పొదుపు సంఘాల వల్ల కలిగే ఉపయోగాలను తెలిపి 5 నుంచి 10 మంది సభ్యులతో గ్రూపులుగా ఏర్పాటు చేయిస్తున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తొలి విడతగా మండపేట, అమలాపురం, రామచంద్ రపురం, ముమ్మిడివరం పట్టణాల్లో మొత్తం 38 పొదుపు సంఘాలను ఏర్పాటు చేశారు. పొదుపు చేసిన వారికి రుణ సౌకర్యం కల్పిస్తున్నారు. నిబంధనల మేరకు 6 నెలలు పొదుపు చేస్తే బ్యాంకు ల ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. సభ్యులు ఎప్పటికప్పుడు తీసు కున్న బ్యాంకు రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తే వారికి ఇచ్చే రుణాన్ని పెంచుతారు. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ పథకం మొదలు కానుంది. రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ నగరాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. ఇప్పటికే 2841 గ్రూపులను ఏర్పాటు చేశారు. వీరందరికీ త్వరలో రుణాలు మంజూరు చేయనున్నారు. ప్రతి సభ్యుడు నెలకు కనీసం రూ.100 చొప్పున 3 నెలలపాటు క్రమం తప్పకుండా పొదుపు చేస్తే ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ కింద రూ.25,000లు అందిస్తుంది. ఈ రుణానికి ప్రభుత్వమే వడ్డీ మాఫీ చేస్తోందని అధికారులు వెల్లడించారు.
Social Plugin