ANDHRAPRADESH:సంచలనం రేపిన తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్తీ నెయ్యి పైన ఆరోపణల పై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టు దాఖలైన పిటీషన్ ఆధారం గా సుప్రీం కోర్టు విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ విచారణ కమిటీ పలు కీలక అంశాలను గుర్తించింది. పలువురు నెయ్య సరఫరా దారులను అరెస్ట్ చేసింది. ఈ విచారణ సాగు తున్న సమయంలో టీటీడీ మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తాజాగా దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీం లో ఉప సంహరించుకున్నారు.
తిరుమల కల్తీ నెయ్యి కేసులో వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు విచారణ వేళ వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ను ఉప సంహరించుకున్నారు. కల్తీ నెయ్యి కేసులో తనను అక్రమంగా ఇరికించాలని ఏపీ ప్రభుత్వం చూస్తోందంటూ సుప్రీంలో సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసారు. దీని పైన సీజేఐ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచా రణ చేసింది. కల్తీ నెయ్యి కేసుపై నియమించిన సిట్ దర్యాప్తును సుప్రీం కోర్టే పర్యవేక్షించాలని కూడా పిటీషన్‌లో సుబ్బారెడ్డి కోరారు. అయితే విచారణ సందర్భంగా ఈ అంశంపై ఇతర న్యాయ మార్గాలను పరిశీలిస్తున్నామని..పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సుబ్బారెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.
సుబ్బారెడ్డి అభ్యర్ధనతో పిటీషన్ ఉప సంహరణకు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం అనమతి ఇచ్చింది. కాగా, తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసును సీబీఐ హైదరాబాద్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు నేతృత్వంలో సాగుతున్న దర్యాప్తు బృందం విచారణ చేస్తుంది.
తిరుమలలో లడ్డూ వినియోగం నుంచి సరఫరా టెండర్లు.. ధరలు.. సరఫరా వ్యవస్థ వంటి అంశాలన లోతుగా పరిశీలన చేసింది. టీటీడీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహా రంలో బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పోమిల్ జైన్ (ఏ3), విపిన్ జైన్ (ఏ4), వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావడా (ఏ5) ను అరెస్ట్ చేయగా, తాజాగా బెయిల్ వచ్చింది. ఇక.. ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది.
Social Plugin