Hot Posts

6/recent/ticker-posts

ప్రపంచం దృష్టి హైదరాబాద్ పైనే.. జీసిసిల అడ్డాగా, తాజా నివేదిక ఇదే!


HYDERABAD:మల్టీ నేషనల్ కంపెనీలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఎక్కువగా భారతదేశాన్ని ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మానవ వనరులు, సాంకేతిక వనరులు, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు వెరసి మల్టీ నేషనల్ కంపెనీలు తమ జిసిసి సెంటర్లను ఏర్పాటు చేయడానికి భారతదేశం వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటైన జిసిసి లలో సగానికి పైన భారతదేశంలోనే ఉండడం దీనికి నిదర్శనం.

దక్షిణాదిలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు

ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఈ జిసిసి సెంటర్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం జీసీసీల సంఖ్యలో బెంగళూరు మొదటి స్థానంలో ఉంటే, ఆ తర్వాత స్థానంలో హైదరాబాద్ నిలిచింది. హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలకు మరియు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ముఖ్య కేంద్రంగా మారుతుందని తాజాగా అమెరికాకు చెందిన రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ వెస్టియన్ విడుదల చేసిన ఒక నివేదిక ద్వారా తెలుస్తుంది.

దేశంలో జీసీసిలలో మొదటి స్థానంలో బెంగళూరు, రెండో స్థానంలో హైదరాబాద్ 

అమెరికాకు చెందిన రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ తాజాగా విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో 1700 జిసిసి లు ఉండగా వాటిల్లో బెంగళూరులో 29% జిసిసి లు ఉన్నాయని పేర్కొంది. అంటే మొత్తం 1700 జిసిసి లలో 487 ఒక బెంగళూరులోనే ఉన్నట్టు పేర్కొంది. ఇక హైదరాబాదులో 273 జిసిసి లు ఉన్నట్టు వెల్లడించింది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్ లో 272, ముంబైలో 27, పూణేలో 178, చెన్నైలో 162 జీసిసి లు ఉన్నట్టు నివేదికలో వెల్లడించింది.

దేశంలో జీసీసిల పెరుగుదలకు కారణాలివే 

దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన మెరుగుపడడం, ప్రభుత్వాలు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అందుబాటులో ఉండడం, తక్కువ ఖర్చుతో కార్యకలాపాలు నిర్వహించగలగడం, పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు వెరసి దేశంలో జీసీసీల ఏర్పాటు పెరుగుతోందని వెస్టిన్ తన నివేదికలో వెల్లడించింది.

ప్రపంచంలో భారత్ లోనే జీసీసీలు ఎక్కువ 

ఇక ప్రపంచవ్యాప్తంగా 3200 జీసీసి లు ఉంటే 53 శాతం భారతదేశంలోనే ఉన్నట్టు పేర్కొంది 2028 నాటికి భారతదేశంలో జిసిసి ల సంఖ్య 2,100 దాటే అవకాశం ఉందని పేర్కొంది ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం జిసిసి లలో ముఖ్యంగా ఆరు ప్రధాన నగరాలలోనే ఉన్నట్టు వెల్లడించింది. మొత్తం 94 శాతం 6 నగరాల్లోని కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 150 కొత్త జిసిసి లు ఏర్పాటు అవుతున్నాయని వాటిలో దాదాపు సగం ఐటీ కి ఐటిఈఎస్ కి సంబంధించిన జిసి సి లు అని పేర్కొంది