Hot Posts

6/recent/ticker-posts

జ‌గ‌న్‌.. 'స‌మ‌ర‌భేరి'.. ముహూర్తం ఎప్పుడు... !


తాజాగా ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావాల‌ని నిర్ణ‌యిం చుకున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు తెలిపాయి.

ANDHRAPRADESH:వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ ఎప్ప‌టిక‌ప్పుడు.. ప్ర‌జ‌ల్లోకి వ‌స్తాన‌నిచెప్ప‌డం.. ఆ వెంట‌నే ఆయ‌న దాని ని వాయిదా వేయ‌డం తెలిసిందే. అయితే.. దీనివ‌ల్ల పార్టీ కేడ‌ర్ స‌హా.. నాయ‌కులు కూడా డీలా ప‌డుతు న్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావాల‌న్న డిమాండ్ జోరుగా వినిపిస్తోంది. జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ ధ్య‌కు వ‌స్తే.. ఆ ఊపు వేరేగా ఉంటుంద‌ని.. పార్టీ విష‌యంలోనూ.. ప్ర‌జ‌ల విష‌యంలో మంచి జోష్ క‌నిపి స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే.. ఈ విష‌యంలో జ‌గ‌న్ ఎప్ప‌టిక‌ప్పుడు వెనుకంజ వేస్తున్నారు.

తాజాగా ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావాల‌ని నిర్ణ‌యిం చుకున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు తెలిపాయి. దీనికి `స‌మ‌ర‌భేరి` పేరును దాదాపు ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచా రం. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స‌మ‌ర‌భేరితోపాటు.. కూట‌మి స‌ర్కారు అక్ర‌మాలు, అన్యాయాల‌పై కూడా స‌మ‌ర భేరి మోగించేందుకు జ‌గ‌న్ రెడీ అవుతున్నార‌ని అంటున్నారు. వైసీపీ నాయ‌కుల‌ను అన్యాయంగా కేసు ల్లో ఇరికించ‌డంతో పాటు.. వారినిఅరెస్టు చేస్తున్న తీరును కూడా ఖండిస్తున్నారు.

ఇలా.. జ‌గ‌న్ స‌మ‌ర‌భేరి పేరుతో కొత్త కార్యక్ర‌మానికి శ్రీకారం చుడుతున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల్లో చ‌ర్చ సాగు తోంది. ఈ కార్య‌క్ర‌మం ద్వారా.. కోల్పోయిన ఓటు బ్యాంకుతో పాటు.. నాయ‌కుల‌ను కూడా చేరువ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తార‌ని చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. కీల‌క నాయ‌కులు పార్టీని వీడిపోయారు. అదేవిధంగా కేడ‌ర్‌లోనూ నిస్తేజం నెల‌కొంది. గ‌తంలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఎలా అయితే.. బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు భ‌య ప‌డ్డారో.. ఇప్పుడు వైసీపీ కేడ‌ర్ కూడా అలానే భ‌య‌ప‌డే ప‌రిస్థితి నెల‌కొంద‌న్న వాద‌న ఆ పార్టీ నాయ‌కుల్లోనే వినిపిస్తోంది.

ఈ ప‌రిణామాల‌కు చెక్ పెట్టేందుకే.. జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నార‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఆయ‌న షెడ్యూల్ ప్ర‌కారం.. ఈ ఏడాది జ‌న‌వ‌రిలోనే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావాలి. కానీ..నిరంత‌రంగా ఆయ‌న ఈ ప‌ని చేయ‌లేదు. కేవ‌లం పొగాకు, మిర్చి, మామిడి రైతుల‌ను ప‌రామ‌ర్శించేందుకు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యా రు. కానీ.. ఇలా కంటితుడుపు కార్య‌క్ర‌మాలు చేయ‌డం వల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని జ‌గ‌న్ కు కీల‌క నాయ‌కులు సూచించారు. దీంతో ఆయ‌న ఇప్ప‌టికిప్పుడు.. ప్ర‌జ‌ల్లోకి రావాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. ఇప్ప‌టికిప్పుడు అన్నా కూడా.. మ‌రో నెల రోజుల వ‌రకు స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్టు స‌మాచారం.