అక్రమ అరెస్ట్ నాడు చంద్రబాబును చేసింది : హోం మంత్రి అనిత
ప్రొసీజర్ యధావిధిగా కొనసాగుతుందని చెప్పిన ఆమె మిథున్ రెడ్డి అరెస్ట్ గురించి మాట్లాడుతూ అనేక కీలక విషయాలను వెల్లడించారు. నేడు సత్యసాయి జిల్లా మడకశిరలో మీడియా సమావేశంలో మాట్లాడిన వంగలపూడి అనిత అక్రమ అరెస్ట్ అనే ఫీలింగ్ వారికి ఉంటే కోర్టులో తేల్చుకోవాలన్నారు. అక్రమ అరెస్ట్ అంటే నాడు చంద్రబాబును చేసిందని, మిధున్ రెడ్డిని చేసింది కాదని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.
పెద్దిరెడ్డిపై ఆ కేసుల విచారణ ముగియలేదు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి సంబంధించిన ఫైళ్ల దహనం కేసు, అటవీ భూములలో అక్రమ నిర్మాణాల పైన కేసులలో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉందని, ఆ కేసులలో దర్యాప్తు ముగియ లేదని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. గండికోట లో బాలిక హత్య కేసుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో నిందితుడి పైన క్లారిటీ వస్తుందని, అప్పటివరకు ఆగాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.
నాడు నేడు కార్యక్రమంపై విచారణ చేస్తే అన్నీ బయటకు వస్తాయ్
భార్యలు, భర్తలను హతమారుస్తున్న ఘటనలపై అనిత ఇక ఇటీవల కాలంలో భార్యలు భర్తలను హత్య చేస్తున్న సంఘటనల పైన మాట్లాడిన వంగలపూడి అనిత దీనికి మానసికంగా వస్తున్న మార్పు కారణమని, సినిమాలు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్రభావం కూడా చాలా ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు సైబర్ క్రైమ్ స్టేషన్లు పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆమె జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పిఎస్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు
ప్రతి పోలీస్ స్టేషన్ కు రెండు డ్రోన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అందుకు లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మడకశిరలో డిఫెన్స్ పరిశ్రమ త్వరలో రాబోతుందని వంగలపూడి అనిత వెల్లడించారు. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని చెప్పి సాక్షి క్యాలెండర్ విడుదల చేసిందని ఎద్దేవా చేశారు.
Social Plugin