ANDHRAPRADESH:జనం గుండెల్లో జగన్ ఉన్నారు కనుక కూటమి ప్రభుత్వం జగన్ ను టార్గెట్ చేసిందని మాజీ మంత్రి విడుదల రజిని అన్నారు. నేడు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో విడుదల రజని జగన్ పర్యటన సమయంలో నిబంధనలు ఉల్లంఘించారు అన్న ఆరోపణల పైన పోలీసుల ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె జగన్ పర్యటనకు జన సమీకరణ చేశామని తమపై కేసులు పెట్టారని ఆరోపణలు చేశారు.
జగన్ కోసం జనం స్వచ్చందంగా తరలి వస్తున్నారు: విడదల రజిని
ప్రజల్లో జగన్ కు విపరీతమైన ఆదరణ ఉందని, జగన్ కు ఉన్న ప్రజాదరణను కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారు అన్నారు. ఎక్కడికి వెళ్ళినా జనం జగన్ కోసం స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అసలు జగన్ పర్యటనలకు తాము ఎటువంటి జన సమీకరణ చేయలేదని ఆమె స్పష్టం చేశారు.
చంద్రబాబుకు జగన్ కు వస్తున్న ఆదరణ చూసి భయం
చంద్రబాబుకు జగన్ కు జనం మద్దతు చూసి భయం పట్టుకుందని, అందుకే పోలీసుల ద్వారా జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ విడదల రజిని విమర్శలు గుప్పించారు. సూపర్ సిక్స్ పేరుతో మాయమాటలు చెప్పిన చంద్రబాబు ప్రజలందరినీ మోసం చేశారన్నారు. అందుకే ప్రజలు జగన్ తో ఉన్నారని ఆమె స్పష్టం చేశారు.
జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవరకు భయపడేది లేదు
పోలీసులు తమను ఏడాదికాలంగా వేధిస్తున్నారని పోలీసులను అడ్డుపెట్టుకొని తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విడదల రజిని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది లేదని స్పష్టంచేశారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవరకు వైసీపీనేతలు ఎవరు భయపడరని ఆమె ధీమాగా చెప్పారు. ఎంపీ మిథున్ రెడ్డి పైన తప్పుడుకేసు పెట్టి అరెస్టు చేశారని జగన్ చుట్టూ ఉన్న వాళ్ళను అరెస్టు చేయాలని చూస్తున్నారని మాజీమంత్రి విడదల రజిని ఆరోపించారు.
చంద్రబాబు ప్రభుత్వం పైన పోరాటం చేస్తాం
ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్ వెంటే నడుస్తామని విడదల రజని తేల్చి చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు కనిపిస్తోంది అని ఆమె అన్నారు కూటమి పెద్దలు ఒక కట్టుకథ అల్లడం దానికి స్కామ్ అని పేరు పెట్టి వైసిపి నేతలను జైలుకు పంపడం సాధారణంగా మారిపోయిందని అభిప్రాయపడ్డారు అక్రమ కేసు పెట్టి మిథున్ రెడ్డి ని జైలుకు పంపారని, ఆయన అరెస్ట్ దారుణమన్నారు.
Social Plugin