ANDHRAPRADESH:దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుపతి తొక్కిసలాట ఘటన పైన విచారణ కమిటీ నివేదిక సమర్పించింది. ఇద్దరు అధికారుల పై క్రిమినల్ చర్యలకు సిఫారసు చేసింది. కమిటీ నివేదిక పైన మంత్రివర్గ భేటీలో చర్చించారు. అయిదుగురు మరణనానికి ఆ ఇద్దరు అధికారులదే బాధ్యత అని తేల్చి చెప్పారు. ఈ కమిటీ నివేదిక .. ప్రభుత్వ స్పందన పైన టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణా కర రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ ఘటన పైన సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేసారు.
జరిగింది ఇదీ
ప్రభుత్వం తమ అనుకూల అధికారులను కాపాడుకునేందుకు..వాస్తవాలు వెలుగు చూడకుండా ఉండేందుకు తిరుపతి తొక్కిసలాటపై జ్యుడీషియల్ విచారణను నిర్వీర్యం చేశారని భూమన ఆరో పించారు. తొక్కిసలాటకు బాధ్యులైన వారు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కావడం తో వారిని కాపాడేందుకు మొత్తం నివేదికనే నీరుగార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిందిస్థాయి ఉద్యోగులను బలిపశువులను చేశారని ధ్వజమెత్తారు. ఈ ఘటనలో అసలు నిజాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వీలైనంత ఎక్కువమంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించా లన్న ఉద్దేశంతో శ్రీరంగపట్టణాన్ని ఆదర్శంగా తీసుకుని పది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను కల్పించడం జరిగిందని గుర్తు చేసారు.
వారితో సాక్ష్యం
23 మంది మఠాధిపతుల ఆశీర్వాదాలతో దేశంలోని హిందువులంతా గర్వించేలా రెండేళ్లపాటు అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని వివరంచారు. ఆ రెండేళ్లు కూడా వైకుంఠ ఏకా దశికి ముందు రోజు రాత్రే పది రోజులకు టోకెన్లు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఎలాంటి తొక్కిస లాట జరగుండా భక్తులు టోకెన్లు తీసుకుని నిర్విఘ్నంగా స్వామి వారి దర్శనం చేసుకుని వెళ్ లిపోయారని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వంలో టోకెన్ల పంపిణీ అడ్డగోలుగా జరిగిందని మండి పడ్డారు. టోకెన్ల పంపిణీలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో 6 మంది భక్తులు చనిపోగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారని గుర్తు చేసారు. ఆరు నెలల తర్వాత ఇచ్చిన కమిషన్ నివేదిక చూస్తే విచారణ పేరుతో తమకు కావాల్సిన వారితోనే సాక్ష్యం ఇప్పించుకుని ప్రభుత్వమే రిపోర్టు రాసి వారితో ఇప్పించినట్టు స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.
సీబీఐ విచారణ
కేబినెట్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయం చూస్తే అసలు నిందితులను వదిలేసి మేకలను బలి చ్చినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. ముందే అనుకున్నట్టుగా డెయిరీ ఫామ్ అధికారి హరినాథ రెడ్డి, క్రైమ్ డీఎస్పీ రమణ కుమార్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారని పేర్కొ న్నారు. 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి జరిగినప్పుడు విచార ణకు వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి చందనా ఖన్.. తొక్కిసలాటల ఘటనలకు ఈవోనే బాధ్య త వహించాలని తన నివేదికలో ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పారని గుర్తు చేసారు. సీబీఐకి అప్పగిస్తే తప్ప ఈ ఘటనకి కారణమైన నిజమైన నిందితులు బయటకొచ్చే పరిస్థితులు కనిపించడం లేదని వైయస్ఆర్‌సీపీ అభిప్రాయపడుతోందన్నారు. హిందువుల మనోభావాలు కాపాడాలంటే సీబీఐతో
Social Plugin