THIRUPATHI:తిరుపతి రైల్యే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు బోగీల్లో మంటలు చేలరేగాయి. రైలు బోగీల నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. బీమాస్ హోటల్ వెనక భాగంలో ప్రమాదం జరిగింది. హిస్సార్ టూ తిరుపతి (04717) ట్రైన్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు బోగీలు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో రెండు బోగీల్లో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
తిరుపతిలోని రైల్వే స్టేషన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హిస్సార్ ఎక్స్ ప్రెస్ లోని రెండు బోగీల్లో మంటలు చేలరేగాయి. రెండు బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. హిస్సార్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి రైల్వేస్టేషన్ కు వచ్చి ప్రయాణికులను రైల్వే స్టేషన్‌లో దింపేసిన తర్వాత యార్డులోకి వెళ్లే క్రమంలో ఇంజిన్ వెనకపైపు ఉన్న బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఘటనపై ఆర్‌పీఎఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తిరుపతి రైల్వే స్టేషన్ లో ఇతర రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేదని రైల్వే అధికారులు పేర్కొన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరే రైళ్లు కానీ.. స్టేషన్ కు వచ్చే రైళ్లు కానీ ఎలాంటి ఆలస్యం లేదని తెలిపారు.
🚨Breaking News 🚨
— Telugu Feed (@Telugufeedsite) July 14, 2025
తిరుపతిలో రైలు ప్రమాదం
హిస్సార్ టు తిరుపతి (04717) ట్రైన్లో చాలా చెలరేగిన మంటలు
రెండు బోగీలు దగ్ధం, సంఘటన ప్రాంతానికి చేరుకున్న ఫైరింజన్లు, రెండు బోగీలు దగ్ధం#FireAccident #Tirupati #Train pic.twitter.com/2BHtU7XSeW
Social Plugin