Hot Posts

6/recent/ticker-posts

అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భాంతి


రెడ్డివారిపల్లె చెరువు వద్ద మామిడికాయల లోడ్ లారీ బోల్తా

మృతి చెందిన తొమ్మిది మంది కూలీలు

కూలీలు మరణించడం అత్యంత దురదృష్టకరమన్న వైఎస్ జగన్

గాయపడిన వారికి ప్రభుత్వం మంచి వైద్యం అందేలా చూడాలన్న వైఎస్ జగన్

ANDHRAPRADESH:అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం, రెడ్డివారిపల్లె చెరువు వద్ద మామిడికాయల లోడు లారీ బోల్తాపడిన దుర్ఘటనలో తొమ్మిది మంది కూలీలు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ ప్రమాదంలో కూలీలు మరణించడం అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరణించిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఆ పేద కుటుంబాలకు అండగా నిలవాలని జగన్ ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.