Hot Posts

6/recent/ticker-posts

జగన్ గూటికి కీలక నేత రీ ఎంట్రీ - మారుతున్న లెక్కలు..!?


ANDHRAPRADESH:ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు పూర్తయింది. వైసీపీ లక్ష్యంగా కూటమి పార్టీలు రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. జగన్ పర్యటనలతో వైసీపీలో తిరిగి జోష్ కనిపిస్తోంది. ఎన్నికల్లో ఓడిన తరువాత పలువురు ముఖ్య నేతలు వైసీపీని వీడారు. కూటమి పార్టీల్లో చేరారు. ఇప్పుడు చేరికలు తగ్గాయి. అదే సమయంలో వైసీపీ వీడిన నేతలు తిరిగి పార్టీ నేతలతో టచ్ లోకి వస్తున్నారు. అదే క్రమంలో వైసీపీని వీడి తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కీలక నేత తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

మారుతున్న పరిణామాలు 

2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం అయిన వైసీపీ తిరిగి కోలుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. జగన్ పర్యటనలకు వస్తున్న స్పందన ఆ పార్టీలో జోష్ పెంచుతోంది. ప్రభుత్వం పైన భారీ వ్యతిరేకత ఉందని.. తిరిగి తామే అధికారంలోకి వస్తామని జగన్ ఇప్పటి నుంచే ధీమాగా చెబు తున్నారు. వరుస కేసుల పైన తొలుత వైసీపీలో ఆందోళన కనిపించినా... ఇప్పుడు మార్పు కనిపి స్తోంది. ఇక.. పార్టీని వీడిన నేతలు కూటమి పార్టీల్లో గుర్తింపు లేక డైలమా పరిస్థితుల్లో ఉన్నారు. అదే విధంగా వైసీపీలో కీలకంగా వ్యవహరించిన విజయ సాయిరెడ్డిని సైతం తిరిగి పార్టీలోకి రావాల ని జగన్ ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది.

వైసీపీలోకి రీ ఎంట్రీ 

ఇప్పుడు ప్రకాశం కు చెందిన ఒక ముఖ్య నేత తిగిరి వైసీపీ వైపు చూస్తున్నట్లు పార్టీ వర్గాల సమా చారం. చీరాల కు చెందిన ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగానే పోటీ చేసారు. 2009 లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి.. 2014 లో స్వతంత్ర అభ్యర్దిగా గెలిచి టీడీపీకి మద్దతుగా నిలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆమంచి పైన టీడీపీ అభ్యర్ధి కరణం బలరాం విజయం సాధించారు. వైసీపీ అధికారంలోకి రావటంతో కరణం బలరాం తన కుమారుడతో సహా జగన్ పార్టీకి దగ్గరయ్యారు. దీంతో, చీరాల ఇంఛార్జ్ గా కరణం వెంకటేష్ ను నియమించారు. ఆయనే వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసారు. ఈ పరిణామాలతో వైసీపీ వీడిన ఆమంచి కాంగ్రెస్ నుంచి పోటీలో నిలిచారు.

చీరాల పై నిర్ణయం

2024 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ విజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆమంచికి 41,859 ఓట్లు వచ్చాయి. ఇవి పార్టీ కంటే వ్యక్తిగతంగా ఆమంచికి ఉన్న పట్టు కారణంగా వచ్చిన ఓట్లుగా భావించాలి. కాగా.. ఆమంచి తొలుత జనసేన వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసార నే వాదన ఉంది. ఇక.. ఇప్పుడు తిరిగి వైసీపీలోకి వస్తారని చెబుతున్నారు. జనసేనలోకి ఆమంచి వెళ్లినా.. టీడీపీకి సిట్టింగ్ స్థానం కావటంతో వచ్చే ఎన్నికల్లో పొత్తు కొనసాగినా జనసేనకు ఇచ్చే అవకాశం ఉండదని భావిస్తున్నారు. అయితే, చీరాల - అద్దంకి విషయంలో జగన్ ఫైనల్ నిర్ణయం కీలకం కానుంది. దీంతో.. ఇప్పుడు ఆమంచి తిరిగి పార్టీలో చేరుతారనే చర్చ వేళ.. తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది