Hot Posts

6/recent/ticker-posts

పెద్దిరెడ్డి కళ్లలో దైన్యం’’ చూసేందుకు తిరుపతి వెళ్లిన చంద్రబాబు?


ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి మధ్య దాదాపు 50 ఏళ్లుగా ఆధిపత్య పోరు సాగుతోంది

ANDHRAPRADESH:ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లా పర్యటనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన చిరకాల రాజకీయ ప్రత్యర్థి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంట్లో దైన్యం చూసేందుకు సీఎం తిరుపతిలో పర్యటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఏపీ లిక్కర్ స్కాంలో పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ఈ రోజు విచారణకు హాజరయ్యారు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అదే జరిగితే చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పైచేయి సాధించినట్లే భావిస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు పర్యటన రెండు రోజుల ముందే ఖరారు అయింది. కానీ, ఇదే రోజున పెద్దిరెడ్డి కుటుంబానికి ఝలక్ తగిలే పరిస్థితులు ఎదురవడమే రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి మధ్య దాదాపు 50 ఏళ్లుగా ఆధిపత్య పోరు సాగుతోంది. వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో చదువుకున్న రోజుల నుంచే చంద్రబాబు, పెద్దిరెడ్డి మధ్య వైరం మొదలైందని అంటున్నారు. తర్వాత రాజకీయంగా ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ నుంచే ఆరంగేట్రం చేసినా, ఇద్దరు ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికే ప్రయత్నించారని చెబుతారు. ముఖ్యంగా జిల్లా రాజకీయాలను శాసించడానికి ఇద్దరూ పోటీపడ్డారు. ఈ క్రమంలోనే చంద్రబాబు టీడీపీలోకి వెళ్లడం.. ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం జరిగింది. అయితే జిల్లా రాజకీయాల్లో పెద్దిరెడ్డి హవాయే కొనసాగు

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వడంతో ఆయన సొంత జిల్లాలో ప్రత్యర్థులు పట్టు బిగించారు. ఇందులో తన చిరకాల ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృషి ఎక్కువగా కనిపిస్తుందని అంటుంటారు. రాష్ట్రం మొత్తం టీడీపీ హవా ఉన్నా, ఉమ్మడి చిత్తూరులో పెద్దిరెడ్డి ప్రభావంతో గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ ఎక్కువ సీట్లు సాధించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇక తాజా ఎన్నికల్లో సైతం వైసీపీ 11 సీట్లకు పరిమితమైతే అందులో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులే ఇద్దరు గెలవడం గమనార్హం.

ఇక గత ప్రభుత్వంలో రాయలసీమ వ్యవహారాలను పర్యవేక్షించిన పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా వైసీపీ రెపరెపలాడేలా ప్రయత్నాలు చేశారు. కుప్పం మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైసీపీని గెలిపించారు. కుప్పం ఇన్చార్జిగా వ్యవహరించిన పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును రాజకీయంగా తీరని దెబ్బ తీయాలని చూశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అయింది. 

టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి రికార్డు విజయం సాధించింది. ఇక చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన చిరకాల రాజకీయ ప్రత్యర్థిపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇక లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు ఉండటంతో రాజకీయంగా పెద్దిరెడ్డికి ఇరకాటమే అంటున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పర్యటన రోజే సిట్ విచారణకు మిథున్ రెడ్డి వెళ్లడం కాకతాళీయమేనా, పెద్దిరెడ్డి కళ్లల్లో భయం, ధైన్యం చూడటానికే సీఎం చిత్తూరు వస్తున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది