HYDERABAD:తెలంగాణలో మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. రాష్ట్రంలోని రహదారులను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. తెలంగాణలోని 15 జాతీయ రహదారులను రెండు నుంచి నాలుగు లైన్ లుకా మార్చి విస్తరించాలని భావిస్తోంది. ఇందుకు రూ. 33,690 కోట్లు ఖర్చు అవుతున్న ట్లు అంచనా వేసింది. రాష్ట్రం వ్యాప్తంగా 1,123 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా రోడ్లను విస్తరించేందుకు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ అభివృద్ధి పనులు 2028 నాటికి పూర్తి కానున్నాయి.
తెలంగాణలోని రహదారులను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రూ. 33, 690 కోట్లతో 1,123 కిలోమీటర్ల మేర రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 2028 నాటికి పనులు పూర్తి చేయనుంది. ఈ విస్తరణలో జడ్చర్ల- కోదాడ లైన్ మొత్తం 219 కిలోమీటర్లు అతిపెద్ద ప్రాజెక్ట్ గా ఉంది. ఈ రోడ్ల విస్తరణ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. అలాగే రోడ్ల వెంట ఉన్న భూముల ధరలు కూడా పెరగనున్నట్లు అంచనా.
15 రోడ్లు ఇవే..
NH-167లోని జడ్చర్ల- కల్వకుర్తి- మల్లేపల్లి- హాలియా- అలీనగర్- మిర్యాలగూడ మీదుగా కోదాడ వరకు 219 కిలోమీటర్లు.
NH-365: నకిరేకల్- మల్లంపల్లి సెక్షన్‌లోని నకిరేకల్- తానంచర్ల వరకు, నర్సంపేట బైపాస్ 181 కి.మీ.
NH-563: ఖమ్మం-వరంగల్ సెక్షన్ లో 119 కి.మీ.
NH-30: విజయవాడ- జగదల్ పూర్ సెక్షన్ లో రుద్రంపూర్- భద్రాచలం వరకు. ఇందులో కొత్తగూడెం, పాల్వంచ బైపాస్ రోడ్లకు అనుసంధానం. మొత్తం 100 కి.మీ.
NH-365: సూర్యాపేట- జనగామ సెక్షన్‌లో 83 కిలోమీటర్లు.
NH-365బిబి: ఖమ్మం- సత్తుపల్లి మార్గం. 81 కిలోమీటర్లు.
NH-163: మన్నెగూడ- రావులపల్లి సెక్షన్‌లో 73 కి.మీ.
NH-765డి: హైదరాబాద్ ఓఆర్‌ఆర్ నుంచి మెదక్ సెక్షన్ వరకు 63 కి.మీ.
NH-353సి: పరకాల బైపాస్, భూపాలపల్లి బైపాస్ వరకు 61 కి.మీ.
NH-61: కల్యాణ్- నిర్మల్ సెక్షన్‌లో 53 కిలోమీటర్లు.
NH-63: బోధన్- నిజామాబాద్ సెక్షన్‌లోని మైనర్ బ్రిడ్జిని 4 లేన్లుగా మార్చడం. ఇదే మార్గంలో 4 లేన్లుగా రోడ్డు, మరో చోట ఆర్వోబీ నిర్మాణంతో పాటు మహారాష్ట్ర సరిహద్దు నుంచి బోధన్ వరకు మిగిలిన పనుల పూర్తి. మొత్తం 36 కిలోమీటర్లు.
NH-163: హైదరాబాద్- భూపాలపట్నం మార్గంలో ఒకచోట విస్తరణ, రెండు చోట్ల మేజర్ బ్రిడ్జిల నిర్మాణం, మరో చోట రోడ్డు విస్తరణ. మొత్తం 26 కిలోమీటర్లు
NH-167, ఎన్‌హెచ్-167ఎన్: మహబూబ్‌నగర్ బైపాస్ నిర్మాణం. ఇది 11 కి.మీ. ఉండనుంది.
NH-63: నిజామాబాద్- జగదళ్‌పూర్ సెక్షన్‌లో రహదారి విస్తరణ, ఒకచోట మేజర్ బ్రిడ్జి నిర్మాణం. ఇది 10 కి.మీ.
NH-765డి: మెదక్ బైపాస్ నిర్మాణం. ఇది 7 కిలోమీటర్లు ఉండనుంది.
మరోవైపు ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్బన్, సెమీ అర్బన్, రూరల్ కేటగిరీలుగా ప్రాధాన్యతా క్రమంలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. హ్యామ్ విధానంలో ఆర్ అండ్ బీ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 శాతం రోడ్లు కవర్ అవుతాయని, ఈ ప్రాజెక్టును అధికారులు సీరియస్ గా తీసుకోవాలన్నారు
Social Plugin