Hot Posts

6/recent/ticker-posts

దంచికొడుతున్న వాన - అటుగా రావద్దు, బిగ్ అలర్ట్..!!


HYDERABAD:హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తోంది. ప్రధాన రహదారులన్నీ నీటిలో మునిగాయి. వర్షపు నీటితో ట్రాఫిక్ సమస్యలు మొదలయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో భారీ వర్షంతో వాహనాలు ముందుకు కదలటం లేదు. ఈ వర్షం ఈ రోజు రాత్రి మొత్తం కొనసాగే అవకాశం ఉంది. దీంతో, అత్యవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.

హైదరాబాద్ నగరం భారీ వర్షంతో తడిసి ముద్దైంది. కొంత కాలంగా పెరిగిన ఎండ వేడితో నగర వాసులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. తాజా వర్షాలతో ఉపశమనం పొందారు. అయితే, మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ నగ రంలోని జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, మెహదీపట్నం, మణికొండ, టోలిచౌకి, షేక్‌పేట్‌, గోల్కొండ, అత్తాపూర్, లంగర్‌హౌస్‌, బంజారాహిల్స్, తార్నాక, ఓయూ, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, కూకట్‌పల్లి, కేపీహెచ్బీ, నిజాంపేట్‌, మియాపూర్‌, మూసాపేట్‌ సహా బాలానగర్‌, సనత్‌నగర్‌, ఎర్రగడ్డలో భారీ వర్షం కురుస్తోంది. అలాగే మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, శేరిలింగంపల్లి, హకీంపేట్‌, కంటోన్మెంట్‌, ఖైరతాబాద్‌లోనూ భారీగా వర్షం పడుతోంది