Hot Posts

6/recent/ticker-posts

బంగ్లాదేశ్ కి‘లేడీ’ ప్లానింగ్ దెబ్బకు హాహాకారాలు చేస్తున్న మగాళ్లు

అనంతరం తన పేరును రీతూరావుగా మార్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఆసిఫ్ నగర్ కు చెందిన నరేష్ కు పరిచయమైంది.

HYDERABAD:బంగ్లాదేశ్ కు చెందిన యువతిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు సంబంధించిన వివరాలు షాకింగ్ గా మారటమే కాదు.. ఆమె బరితెగింపు ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. పాతికేళ్ల రీతూమోనీ బంగ్లాదేశ్ కు చెందిన యువతి. హైదరాబాద్ కు అక్రమంగా వచ్చిన ఆమె.. జాబ్ లో భాగంగా ఊరికి వచ్చినట్లుచెప్పి ఇంటిని అద్దెకు తీసుకుంది. అనంతరం తన పేరును రీతూరావుగా మార్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఆసిఫ్ నగర్ కు చెందిన నరేష్ కు పరిచయమైంది.

వారిద్దరు కొంతకాలం సహజీవనం చేసిన తర్వాత అతడి అడ్రస్ తో రీతూరావు పేరుతో ఆధార్.. పాన్ గుర్తింపు కార్డుల్ని సంపాదించింది. అనంతరం కొన్ని రోజులకు గన్ ఫ్రౌండీకి చెందిన శేఖర్ తో పరిచయమైంది. అతడి వద్దకు చేరిన ఆమె.. మళ్లీ తన ఆధార్ కార్డులో మార్పులు చేయించింది. అతడితో సహజీవనం చేస్తున్న వేళలో ఆమె తీరు అనుమానాస్పదంగా ఉండటంతో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. 

ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించాడు. అక్కడ ఉన్న సమయంలో నిజామాబాద్ కు చెందిన ప్రవీణ్ తో ఆమెకు పరిచయమైంది. తాను ఆసుపత్రిలో ఉన్నట్లుగా చెబుతూ.. డిశ్చార్జి అయ్యాక అతడితో కలిసి విద్యానగర్ కు మకాం మార్చింది. కొద్దిరోజులకు పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేసింది. అయితే.. వాయిదా వేస్తూ వచ్చాడు.

చివరకు అతడ్ని ఒప్పించిన రీతూరావు ఈ ఏడాది ఏప్రిల్ 15న యాదాద్రిలో పెళ్లి చేసుకునేలా చేసింది. అయితే.. తనకు గతంలోనే పెళ్లైన విషయాన్ని దాచిన ప్రవీణ్ ఆమెను పెళ్లాడాడు. ఈ మధ్యన ఆమెది బంగ్లాదేశ్ అని తేలటంతో ఆమెను నిలదీశాడు. అక్రమంగా దేశానికి వచ్చిన యువతితో తాను సన్నిహితంగా ఉన్నట్లు బయటకు వచ్చినట్లు తెలిస్తే తనకు కేసులు తప్పవన్న భయంతో ఆమెను వదిలేసి పారిపోయాడు.

తనను వదిలేసిన ప్రవీణ్ ను రీతూరావు మాత్రం వదల్లేదు. సోషల్ మీడియా ద్వారా అతడి భార్యను పరిచయం చేసుకుంది. ప్రవీణ్ తో తనకు పెళ్లి జరిగిన విషయాన్ని తెలియజేయటంతో పాటు.. అందుకు సాక్ష్యంగా ఫోటోల్ని పంపింది. రీతూరావు తీరు గురించి కొందరు నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేయటంతో దర్యాప్తు చేపట్టారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించిన వేళ.. పలువురు మగాళ్లను ట్రాప్ చేసిన వైనం వెలుగు చూసింది. అంతేకాదు.. ఆమెకు సహకరించి న శ్రీకాంత్.. పెళ్లి చేసుకున్న ప్రవీణ్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సో... కొత్తవాళ్ల విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరముంది.