Hot Posts

6/recent/ticker-posts

నిరుపయోగంగా సుకుమార్ ఇచ్చిన ఆక్సిజన్ యూనిట్... ఏం జరిగింది?


దాతల ఆశయం నెరవేరాలంటే వెంటనే దాన్ని వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలని కోరారు.

ANDHRAPRADESH:కరోనా మహామ్మారి సమయంలో ఆక్సిజన్ పడకలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న బాధితులను ఆదుకోవడానికి ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. శాశ్వత ప్రాతిపదికన రూ.40 లక్షల వ్యయంతో రాజోలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో 80 ఎల్‌.పీ.ఎమ్ ఆక్సిజన్ ఉత్పాదన కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే.. అది ఇప్పుడు నిరుపయోగంగా మారిందని అంటున్నారు.

అవును... తన స్వగ్రామానికి సమీపంలోని రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో శాశ్వత ప్రాతిపదికన రూ.40 లక్షల వ్యయంతో సినీ దర్శకుడు సుకుమార్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ యూనిట్ ఇప్పుడు నిరుపయోగంగా మారిందని ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దాతల ఆశయం నెరవేరాలంటే వెంటనే దాన్ని వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలని కోరారు.

కోవిడ్ సమయంలో ఈ యూనిట్ ని మంచిగానే ఉపయోగించారని.. అయితే, గత కొంతకాలంగా దీన్ని పూర్తిగా నిరుపయోగంగా మార్చారని అన్నారు. దాతల ఎంతో గొప్ప ఆశయంతో చేసిన పనులను వైద్యులు, అధికారులు నిరుపయోగంగా మార్చారని ఆరోపించారు! ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కల్పించుకుని ఈ ప్లాంట్ ఉపయోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

కాగా... కరోనా మహమ్మారి సమయంలో మూవీ డైరెక్టర్ సుకుమార్ తన తండ్రి బండ్రెడ్డి తిరుపతిరావు నాయుడు జ్ఞాపకార్ధం ఈ ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని 2021 మే 25న అప్పటి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ప్రారంభించారు.