Hot Posts

6/recent/ticker-posts

ఉత్తరాంధ్రాలో బాబు మెచ్చిన ఎమ్మెల్యే!


ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర తాజాగా కలిశారు.

ANDHRAPRADESH:టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు పొందడం అంటే చాలా కష్టమైన విషయం. ఆయన అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తారు. ఆయనది దాదాపుగా యాభై ఏళ్ల రాజకీయ అనుభవం. పైగా ఆయన క్షేత్ర స్థాయి నుంచి ఎదిగి వచ్చిన నాయకుడు. అందువల్ల ఆయనకు ఎక్కడ ఏమిటి ఎలా ఉంది అన్నీ తెలుస్తాయి. అంతే కాదు ఆయనకు వివిధ రకాలుగా సమాచారం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. దాంతో ఆయన ప్రతీ ఎమ్మెల్యే విషయంలో తనదైన అంచనాను కలిగి ఉంటారు.

ఆయనకు మంచి మార్కులు :

అయితే టీడీపీలో ఉన్న 135 మంది ఎమ్మెల్యేల పనితీరు మీద ఎప్పటికప్పుడు బాబు సర్వేలు జరిపిస్తూ వస్తున్నారు. అంతే కాదు పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా వారు చేపట్టిన కార్యక్రమాలు వాటికి వస్తున్న స్పందన వంటి వాటి మీద కూడా అధ్యయనం చేయిస్తూ ఉంటారు. ఆ విధంగా వచ్చిన నివేదికలో ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి ఆ ఎమ్మెల్యేకు మంచి మార్కులు పడ్డాయని అంటున్నారు. ఆయన తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యే. అంతకు ముందు టీడీపీ నుంచి ఎంతో మంది సీనియర్లు ఉన్నా వారిని పక్కన పెట్టేసి ఆయనకు చాన్స్ ఇచ్చారు. దానికి తగినట్లుగా ఆయన వ్యవహరించి బాబు మెప్పు పొందారు. ఆయనే పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర.

బాబుని కలసిన ఎమ్మెల్యే 

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర తాజాగా కలిశారు.పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులను, సమస్యలను వివరించి నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరారు. అలాగే ఇటీవల నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం విజయవంతం చేసినట్లుగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర బాబూకు వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని తెలిపారు.

దిశా నిర్దేశంతో ఉత్సాహం 

పార్వతీపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే చెబుతున్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో 87.97 శాతం మేర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యేగా బాబు ఆయనను మెచ్చుకున్నారు. అందువల్లనే మంచి ర్యాంకు సాధించారని అభినందించారు. ఇదే ఊపుతో మరింత వేగంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు ఎమ్మెల్యేకు సూచించారు. మొత్తం మీద ఉత్తరాంధ్ర నుంచి ఒక ఎమ్మెల్యేను బాబు అభినందించడం ఆయన పనితీరుని మెచ్చుకుని మంచి ర్యాంక్ ఇవ్వడం పట్ల టీడీపీలో చర్చ సాగుతోంది. రాజకీయంగా కొత్త అయిన బోనెల విజయచంద్రను తీసుకుని వచ్చి 2024లో టికెట్ ఇస్తే అతి తక్కువ కాలంలో సీఎం నుంచి మెచ్చుకోలు పొందడం మామూలు విషయం కాదని అంటున్నారు. ఆయన స్పూర్తితో మిగిలిన వారు కూడా పనిచేయాలని కోరుతున్నారు.