Hot Posts

6/recent/ticker-posts

తాడేపల్లి ముఖం చూడని జగన్...అక్కడ సీరియస్ గానే


ANDHRAPRADESH:వైసీపీకి ఇపుడు ట్రబుల్ షూటర్ అన్న వారు ఎవరూ లేకుండా పోయారు అని అంటున్నారు విజయసాయిరెడ్డి గతంలో పార్టీలో ఉండేవారు.

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ 2024 ఎన్నికల్లో ఓటమి చెందాక బెంగళూరులోని తన పాలెస్ లో ఉంటున్నారు. ఆయన వారంలో నాలుగు రోజుల పాటు తాడేపల్లికి వస్తూంటారు. ఈ సందర్భంగానే పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. అలా గత ఏడాదిగా సాగుతోంది. కానీ ఈసారి దానికి భిన్నంగా వారం రోజుల పాటు ఆయన ఈ వైపు రాలేదని అంటున్నారు. జగన్ తాడేపల్లికి ఈ వారం రాలేదని ప్రచారం సాగుతోంది.

హాట్ డిస్కషన్స్ దానిమీదేనా 

వైసీపీ అధినేత బెంగళూరులోని తన నివాసంలో ఒక ఇష్యూ మీద హాట్ డిస్కషన్స్ చేస్తున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది. అదే లిక్కర్ స్కాం అని అంటున్నారు. వైసీపీ అధినాయకత్వం మొదట్లో లిక్కర్ స్కాం ని పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు. అయితే ఈ కేసుని ఒక పద్ధతి ప్రకారమే సిట్ దర్యాప్తు చేస్తోంది అని తెలుస్తోంది. దాంతో లోతుల్లోకి వెళ్తే ఎక్కడైనా ఇబ్బంది అవుతుందా అన్న చర్చ కూడా వైసీపీ పెద్దలలో ఉందని అంటున్నారు. జగన్ సైతం ఇదే విషయం మీద తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారని ప్రచారం అయితే సాగుతోంది.

అనుకోనిది జరిగితే 

ఇదిలా ఉంటే మద్యం కుంభకోణంలో అనుకోనిది జరిగితే ఏమిటి దారి అన్నది కూడా వైసీపీ పెద్దలలో ఉంది అని అంటున్నారు. ఒకవేళ జగన్ అరెస్టు అయితే వైసీపీకి సానుభూతి ఏ మేరకు వస్తుందని కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అయితే ఇప్పటికే మద్యం కుంభకోణం విషయంలో కూటమి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రజలలో ఈ మ్యాటర్ ని పూర్తిగా చర్చకు పెట్టేసింది అని అంటున్నారు. దాంతో ఏ మేరకు సింపతీ మైలేజ్ వస్తుంది అన్నది కూడా చర్చగానే ఉందిట.

కీలక సమయంలో ఆయన లేని లోటు 

వైసీపీకి ఇపుడు ట్రబుల్ షూటర్ అన్న వారు ఎవరూ లేకుండా పోయారు అని అంటున్నారు విజయసాయిరెడ్డి గతంలో పార్టీలో ఉండేవారు. ఆయన ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయడంతో దిట్ట అని చెప్పుకునేవారు. ఆయన కనుసన్నలలో పార్టీ వ్యవహారాలు సాగినపుడు అధినాయకత్వం మీద ఈగ వాలకుండా చూసుకున్నారు అని అంటున్నారు. ఇపుడు చూస్తే కోటరి అని పేరు ఉంది కానీ ఎవరూ ఆయన స్థాయిలో సాయం చేసేవారు వ్యూహం పన్నేవారూ లేరని అంటున్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వైవీ సుబ్బారెడ్డి ఉన్నా ఆయనకు ఢిల్లీలో విజయసాయిరెడ్డి స్థాయిలో లాబీయింగ్ అన్నది తెలియదనే అంటున్నారు మొత్తం మీద వైసీపీని అన్ని వైపులా సమస్యలు చుట్టుముడుతున్న వేళ విజయసాయిరెడ్డి గుర్తుకు వస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోందిట.