చూడబోతే కాలం మారింది. ఏఐ కాలం నడుస్తోంది. లేనివి ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చూపించే కృత్రిమ మేధ యుగంలో అంతా ఉన్నారు.
ANDHRAPRADESH:జగన్ ట్రెడిషనల్ పొలిటీషియన్ కాదు. ఒకరి బాటలో ఆయన నడవరు. తనకు తోచిన తీరున ఆయన ముందుకు సాగుతారు. రాజకీయం అంటే గణిత శాస్త్రం అంటారు. అందులో బోలెడు ప్లస్సులు మైనస్సులు ఉంటాయి. కానీ జగన్ మాత్రం వాటిని ఏ మాత్రం పట్టించుకోరు. ఆయన తాను ఏమనుకుంటే ఆ విధంగానే ఉంటారు. అలాగే నిర్ణయాలు తీసుకుంటారు అని చెబుతారు.
ఇక జగన్ అంటే ఎపుడూ కొత్త దనం అన్నది నిన్నటి కధగా మారుతోంది. అవును ఓదార్పు యాత్రలను పరామర్శ యాత్రలను భారీ పాదయాత్రలను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఏపీ రాజకీయాలకు పరిచయం చేసిన జగన్ తాను కూడా ఒక మూసలో పోతున్నారు అని అంటున్నారు. రొటీన్ రొడ్డకొట్టుడు రాజకీయాలకు జగన్ దూరం అనుకున్న వారికి ఆయన అదే పాలిటిక్స్ ని పదే పదే చేస్తూ బోరు కొట్టిస్తున్నారుట.
అవును ఎవరు ఏమనుకున్నా ఇదే నిజం అంటున్నారు. జగన్ అసెంబ్లీకి పోరు, మరే వేదికను ఆయన భాగం చేసుకోరు. ఆయన మీడియాని ఇటీవల కాలంలో బాగానే పిలుస్తున్నారు. ఆ మీడియా ముందు ఆయన తాను చెప్పాల్సినది అనుకున్నది చెప్పేస్తున్నారు. అయితే మొదట్లో జగన్ ప్రెస్ మీట్లు అంటే ఉన్న ఆసక్తి కాస్తా ఇపుడు సన్నగిల్లుతోంది అని అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఆయన ఇస్తున్న వార్నింగులు బెదిరింపులు మొదట్లో కొత్త కానీ ఇపుడు రొటీన్ అయిపోయాయి అని అంటున్నారు.
పడికట్టు మాటలతో జగన్ పెడుతున్న ప్రెస్ మీట్ల మీద రాజకీయంగా వైసీపీకి పెద్దగా మైలేజ్ ఏదీ రాదనే అంటున్నారు. అంతే కాదు ప్రత్యర్థి పార్టీల మీద కానీ ప్రజల మీద కానీ ఏ విధంగానూ ఒక బలమైన ఇంపాక్ట్ చూపించే అవకాశమూ లేదనే అంటున్నారు. అంతే కాదు ఆయన చెబుతున్నది ఏదీ కొత్త కాదు వింత అంతకంటే కాదు, దాంతో డైలాగులు మార్చు బాసూ అని అంటున్నారుట. ఇంతకీ జగన్ ప్రెస్ మీట్ అంటే రొటీన్ డైలాగులుగా వచ్చేవి ఏంటో చూస్తే కనుక అందరికీ విషయం అర్ధం అవుతుంది.
మేమే అధికారంలోకి వచ్చేస్తాం, ఆ వెంటనే మీ అంతు చూస్తాం. ఇదీ జగన్ చెబుతున్న మాట. మేము కూడా ఏదో ఒక బుక్ ఓపెన్ చేస్తే మీ పరిస్థితి ఏమిటి ఇది మరో డైలాగ్ అని అంటున్నారు. ఇక పోలీసు డిపార్ట్మెంట్ మీద కూడా విమర్శలు చేస్తున్నారు. వారు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అలాంటి వాళ్ళ అంతు తేలుస్తామని జగన్ హెచ్చరిస్తున్నారు. ఇలా చెప్పిన దానినే జగన్ చెప్పుకుంటూ పోతున్నారు దాంతో బోర్ కోడుతోంది అంటున్నారు.
ఎందుకంటే ఇపుడు అంతా సోషల్ మీడియా యుగం, స్పీడ్ యుగం. అందువల్ల ఏ అంశం అయినా ఎక్కువ కాలం నడవదు, జనాలకు అది బోరింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి మాట్లాడింది సోషల్ మీడియాలో నంబర్ ఆఫ్ పోస్టింగులుగా తిరుగుతూ రీ సౌండ్ చేస్తుంది. ఆ విధంగా అది వినీ వినీ విసుగెత్తిస్తుంది అని అంటున్నారు.
చూడబోతే కాలం మారింది. ఏఐ కాలం నడుస్తోంది. లేనివి ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చూపించే కృత్రిమ మేధ యుగంలో అంతా ఉన్నారు. ఈ టైంలో కూడా రొటీన్ డైలాగులు కొడితే ఎవరికి ఎక్కుతాయి బాసూ అని అంటున్నారు. ఒకే టాపిక్ ని పట్టుకుని ఎంతగా లాగినా జనాలు దానిని పట్టుకుని ఉండేలా కనిపించడం లేదు. వారికి అది ఓల్డ్ గానే ఉంటోంది.
జగన్ గతంలో ప్రెస్ మీట్లు పెడితే బాగానే ఉంది అనేవారు. ఎందుకంటే ఆయనకి చూసేవారికీ అది అప్పట్లో కొత్తగా ఉండేది. కానీ ఇపుడు జగన్ ప్రెస్ మీట్ అంటే మాకే బోరింగ్ గా ఉంది అని వైసీపీ వాళ్ళే అంటున్నారుట. పైగా ఔట్ డేటెడ్ ఇష్యూని జగన్ టేకప్ చేస్తున్నారు అని అంటున్నారు. మొదట్లో కూటమి ఎమ్మెల్యేలు వైసీపీ వారిని టార్గెట్ చేశారని ఆ విధంగా ఇబ్బందులు పడిన మాట వాస్తవమే అని అంటున్నారు. కానీ ఇపుడు వారి ఫోకస్ అంతా అవినీతి మీద ఉంది. వారు దానిలోనే పడి మునిగితేలుతున్నారు అని అంటున్నారు. తమకు అంది వచ్చిన అధికారంతో ఏదో ఒకటి కాంక్రీట్ గా చేసుకుని సెటిల్ కావాలని చూస్తున్నారని వైసీపీ నేతలే చెబుతున్నారు.
అంటే జగన్ చెబుతున్నట్లుగా ఆరోపిస్తున్నట్లుగా గ్రౌండ్ లెవెల్ లో అయితే బుక్కులేవీ పెద్దగా లేవు అన్న మాట. అలాటప్పుడు జగన్ టాపిక్ మార్చి అవినీతి మీద అక్రమాల మీద మాట్లాడితే అది జనాలకు కనెక్ట్ అవుతుంది అని అంటున్నారు. అంతే కాదు పోలీసుల మీద పదే పదే విమర్శలు చేయడం కూడా మంచిది కాదనే అంటున్నారు. మొత్తం మీద చూస్తే జగన్ ప్రెస్ మీట్లు బోరు బాబూ బోరు అని వైసీపీ నుంచే వస్తోంది అంటే బాస్ గట్టిగా ఆలోచించాల్సిందే అని అంటున్నారు.
Social Plugin