Hot Posts

6/recent/ticker-posts

కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తా: ఎంపీ పుట్టా మహేష్ కుమార్


 ఏలూరు: కొల్లేరు సమస్యలను తన వ్యక్తిగత సమస్యగా భావించి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. 

కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం కొల్లేటి కోట గ్రామంలో పర్యటించి శృంగవరప్పాడు గ్రామంలో కొల్లేరు ప్రజలతో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. కొల్లేరు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి సగం విజయం సాధించామన్నారు. 

కూటమి ప్రభుత్వం చోరవతోనే సిఈసి కమిటీ కొల్లేరు గ్రామంలో పర్యటించి మాననీయ కోణంలో ప్రజల బాధలను తెలుసుకుందన్నారు. సిఈసి కమిటీ నివేదిక అనంతరం కొల్లేరు సరిహద్దులు సర్వే చేయించాలని సీఎంను కోరుతామన్నారు. అటవీశాఖ అధికారులు అత్యుత్సాహం చూపుతూ ప్రజాప్రతినిధుల మాటల్ని లెక్క చేయటం లేదని ఆరోపించారు.

 అధికారుల తీరును సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు .కొల్లేరు సమస్యలపై ఆక్వా రైతులు అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. అంతకుముందు కొల్లేరు ప్రజలు పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. సముద్రతీర ప్రాంతంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఇస్తున్న ధృతిని కొల్లేరు మత్స్యకారులకు కూడా అందించాలని కోరారు.