టీడీపీ నాయకులతో ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ భూత, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా ఆయన నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో ఉంటున్న వారు.. ఉండని వారు.. అంటూ పెద్ద ఎత్తున పేర్లను కూడా చదవి వినిపించారు. అంతేకాదు.. తనకు సలహాలు ఇస్తున్నవారిపైనా సీరియస్ కామెంట్లే చేశారు. మరోవైపు.. కూటమి సఖ్యత, కేంద్రంతో కలిసి ఉన్న విధానాలను కూడా చంద్రబాబు వివరించారు.
ఇతమిత్థంగా చెప్పాలంటే.. టీడీపీ భవిష్యత్తును చంద్రబాబు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అంటే.. మొత్తంగా టీడీపీపైనే చర్చ సాగింది. కానీ.. ఈ సమావేశంలో రెండు చిత్రమైన వ్యవహారాలు వెలుగు చూశా యి. మెజారిటీ నాయకులు ఈ రెండు విషయాల చుట్టూనే చర్చించుకున్నారు. 1) అత్యంత కీలకమైన సమావేశం అంటూ.. నాలుగు రోజుల ముందుగానే చెప్పినా.. 56 మంది నాయకులు డుమ్మా కొట్టడం.. కొందరు వచ్చి మధ్యలోనే జారు కోవడం. ఈ విషయం నాయకుల మధ్య తీవ్ర చర్చ గా మారింది.
ఇక, దీనికి మించి మరో కీలక విషయం కూడా చర్చకు వచ్చింది. నాయకులు వారిలో వారు చర్చించుకోవ డం కనిపించింది. అదే.. వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన కామెంట్లు. దీనిపైనే ఎక్కువగా చర్చించుకున్నారు. వాస్తవానికి ఇంత పెద్ద విస్తృత సమావేశం నిర్వహించడంపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేకపోయినా.. ఎన్నికలకు నాలుగు సంవత్సరాలు ఉండగా నిర్వహించడం పైనే సందేహాలు వచ్చాయి. ఈ సమయంలో నాయకులు సమావేశంలో ఉండగానే.. వారి ఫోన్లకు కీలక సమాచారం అందింది.
అదే పెద్దిరెడ్డి చేసిన కామెంట్. దీంతో అందరి దృష్టి దానిపై పడింది. వచ్చే ఎన్నికలు 2029లో జరగాల్సి ఉండగా.. పెద్దిరెడ్డి మాత్రం ఈ ఎన్నికలు 2027లోనే జరిగే అవకాశం ఉందని.. తమకు విశ్వసనీయ సమా చారం కూడా ఉందని మీడియాతో వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా నాయకులు దీనిపై నే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇది నిజమేనా? అంటూ.. మీడియాను కూడా ఆరా తీయడం కనిపించింది.
అయితే.. వాస్తవానికి ఇలా జరిగే అవకాశం లేదని, 2029లోనే జరుగుతాయని గతంలో కూడా చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. కానీ, ఎన్నికలకు ఏడాది ముందే ఆయన ఎన్నికలపై సుదీర్ఘ ప్రసంగం చేయడం.. ఇదే సమయంలో పెద్దిరెడ్డి వ్యాఖ్యలు బయటకు రావడం వంటివి మాత్రం తమ్ముళ్ల మధ్యతీవ్ర చర్చనే లేపాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Social Plugin