Hot Posts

6/recent/ticker-posts

6700కోట్ల అరుదైన రికార్డు.. రేపు తెలంగాణా ఆర్టీసీ రాష్ట్రవ్యాప్త సంబరాలు!


HYDERABAD:తెలంగాణ ఆర్టీసీ అరుదైన రికార్డును సాధించింది. ఇప్పటివరకు 200కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ మరో మైలురాయిని దాటినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సక్సెస్ ఫుల్ గా మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఇప్పటివరకు 200కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్న క్రమంలో వారంతా వినియోగించుకున్న ఉచిత ప్రయాణం విలువ 6,700కోట్ల రూపాయలుగా నమోదైనట్టు ఆర్టీసీ పేర్కొంది.

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం సూపర్ సక్సెస్ 

మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి ఎప్పటికప్పుడు నిధులను విడుదల చేస్తోంది. దీంతో 6,700 కోట్ల రూపాయల అరుదైన రికార్డును సాధించింది ఆర్టీసీ. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెట్టింది. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం సూపర్ సక్సెస్ అయిందని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది.

ఆర్టీసీ కీలక నిర్ణయాలు 

మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో, ఆర్టీసీ బస్సుల వినియోగం అధికం కావడంతో బస్సులసంఖ్య పెంచాలని, కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతోపాటే రేపు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలకు సిద్ధమైంది. రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న మహా లక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగింది.

సంబరాలకు పిలుపునిచ్చిన మంత్రి పొన్నం 

ఈ మైలు రాయి సాధించిన నేపథ్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపో లు, 341 బస్ స్టేషన్ లలో సంబరాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మహాలక్ష్మీ పథకం ఆర్టీసీ బస్సులలో ప్రయాణ సౌకర్యాలను పెంచడంతోపాటు, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడం ద్వారా ఆర్టీసీ వినియోగాన్ని పెంచింది.

ఆర్టీసీ సిబ్బందిని అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ 

ఆర్టీసీలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వ సంకల్పం మేరకు విధులు నిర్వర్తిస్తూ, నూతన బస్సులు కొనుగోలు చేస్తూ మహాలక్ష్మి పథకం విజయవంతం కోసం కృషి చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ లు, శ్రామిక్‌లు, ఇతర సిబ్బందిని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల భద్రత, ఉద్యోగుల సంక్షేమం ప్రథమ కర్తవ్యంగా ముందుకు వెళుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో వేడుకలు జరుపుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించిన ప్రయాణ పథకం మహాలక్ష్మి పథకం మహిళల ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించడం మాత్రమే కాకుండా, ప్రజా రవాణా వ్యవస్థను కూడా మరింత బలోపేతం చేస్తుంది.