Hot Posts

6/recent/ticker-posts

ఏపీలో 21వేల కోట్ల భారీ పెట్టుబడులు, వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు!

ANDHRPRADESH:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో భారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఏపీలో భారీ పరిశ్రమల పైన ఆశలు చిగురించాయి. ఫార్మా, సోలార్ ప్యానల్ తయారీ, లైట్ బ్రిక్స్ ఇలా పలు కంపెనీలు 21వేల పెట్టుబడులతో ఏపీలోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం భూమిని కేటాయించడం ఒక శుభ పరిణామంగా భావిస్తున్నారు.

సున్నపురాళ్లపల్లెలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్

కడప జిల్లా వాసుల చిరకాల స్వప్నమైన స్టీల్ ప్లాంట్ సహకారానికి కూడా ఏపీలోని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లె లో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు జెఎస్ డబ్ల్యూ సంస్థకు బాధ్యతలను అప్పగించింది. ఏపీ ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో లారన్స్ ఫార్మా జోన్ అభివృద్ధికి భూమి రాంబిల్లి ఇండస్ట్రియల్ పార్క్ ఫేస్ టు లో 531 .77ఎకరాల భూమిని కేటాయించింది.

లారన్స్ ఫార్మా తో ఉపాధి అవకాశాలు

ఈ భూమికి సంబంధించి ఎకరానికి 30 లక్షలు చొప్పున లారన్స్ సంస్థ చెల్లించనుంది. ఆ సంస్థ వివిధ దశల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. మొత్తం 6350 మందికి ఉపాధి కూడా కల్పించే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇక కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ లో ఐదు గిగా వాట్ల సోలార్ సెల్ సహా, సోలార్ ప్యానల్ మాడ్యూల్స్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.

సోలార్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

మొత్తం 6,933 కోట్ల పెట్టుబడితో అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టిన ప్రతిపాదనలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరోవైపు తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో 1358 కోట్ల రూపాయల పెట్టుబడితో ఔషధ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి యాక్సలెంట్ ఫార్మా సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది.

ఈ పరిశ్రమలకు ప్రభుత్వ ఆమోదం

ఇక మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని ఏఏసీ లైట్ బ్రిక్స్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు వీఎస్ఆర్ సర్కన్ ఇండస్ట్రీస్ సంస్థ రాగా , ఎకరానికి 11.6 2లక్షల చొప్పున 22.45 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు తిరుపతి జిల్లాలోని నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్ లో గ్రీన్ ల్యామ్ లిమిటెడ్ సంస్థ 1147. 05కోట్ల పెట్టుబడితో 1475మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకు రాగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

చిత్తూరు, అనకాపల్లిలలో ఆ సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి

ఇక చిత్తూరు జిల్లా లింగాపురందిన్నె గ్రామంలో ఏసీఈ ఇంటర్నేషనల్ కు గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ డైరీ ఉత్పత్తులు, న్యూట్రిషన్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి 73. 63 ఎకరాల భూములను కేటాయించింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఆరు గిగావాట్ల సోలార్ ప్యానల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆర్ ఈ న్యూ సంస్థకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 3,700 కోట్ల పెట్టుబడులతో, 1200 మందికి ఉపాధి కల్పిస్తుందని ప్రభుత్వం చెబుతుంది.భుత్వం చెబుతుంది.