ANDHRAPRADESH:ANDHRAప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకంలో అవకతవకలను అరికట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే దివ్యాంగుల కోటాలో అర్హతలు లేని వేలాది మందికి పింఛన్లు మంజూరయ్యాయని అధికారులు గుర్తించారు. దాంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ తనిఖీలు మొదలు పెట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది దివ్యాంగులకు నోటీసులు జారీ చేశారు. వీరిలో ఇప్పటివరకు 4.76 లక్షల మంది అధికారులు జరిపిన రీ-వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. మిగిలిన వారు స్పందించకపోతే మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు. అయినా హాజరుకాకపోతే పింఛన్లను నిలిపివేసే అవకాశం ఉంది.
1.08 లక్షల మందికి కట్..
ప్రత్యేక వైద్య బృందాల ద్వారా లబ్ధిదారుల అసలైన వైకల్యం శాతం నిర్ధారించింది. దివ్యాంగుల శారీరక స్థితిని బట్టి కనీసం 40% వైకల్యం ఉన్నవారికే పింఛన్ అందుతుందని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ క్లీనప్ డ్రైవ్ లో అర్హత లేకుండానే దివ్యాంగుల కోటాలో.. పింఛన్లు పొందుతున్నవారు 1.08 లక్షల మంది ఉన్నట్టు సమాచారం.
దీంతో సదరు లబ్ధిదారులపై చర్యలు తీసుకునేందుకు సర్కారు రెడీ అయ్యింది. బోగస్ సదరం సర్టిఫికెట్లను రద్దు చేసి.. వారి పింఛన్లను కూడా నిలిపివేయనుందని అంటున్నారు. జూలై 25 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త సదరం సర్టిఫికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వైద్యులు నిర్ధారించిన వైకల్య శాతంతో అసెస్‌మెంట్ రిపోర్టు ఇవ్వనున్నారు. అంతే కాకుండా ఈ కొత్త ధృవీకరణ పత్రాలు ఉచితంగా లబ్ధిదారులకు అందించనున్నారు
Social Plugin