ఎంపీటీసీ మాజీ సర్పంచ్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఫోన్లో పరామర్శ
దెందులూరు, KSR TV: చల్ల చింతలపూడిలో ఎంపీటీసీ సింహాద్రి పద్మావతి మాజీ గ్రామ సర్పంచ్ సింహాద్రి శ్రీమన్నారాయణ ఇంటి ప్రహరీ గోడను టిడిపి నుంచి వైఎస్ఆర్సిపి లో చేరినందుకే రాజకీయ కక్ష ధోరణితోనే కూల్చివేశారని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటారు ఆ బ్బాయి చౌదరి అన్నారు. ఆదివారం ఎంపీటీసీ సింహాద్రి పద్మావతి గ్రామ మాజీ సర్పంచ్ సింహాద్రి శ్రీమన్నారాయణ లను ఫోన్లో పరామర్శించారు.
సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.. ధైర్యంగా ఉండాలని వైఎస్ఆర్సిపి అండగా ఉంటుందనీ సూచించారు. ఇటువంటి సంఘటనలు ఎంత మాత్రం సరైనది కాదని గోడ కూల్చివేతపై ఉన్నతాధికారులతో మాట్లాడుతానన్నారు. ఈ విషయంలో బాధితులకు అండగా ఉండి న్యాయపోరాటం చేస్తామన్నారు. కూల్చివేతలో విధులు నిర్వహించిన వారు కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. నియోజకవర్గంలో భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరిగితే వైఎస్ఆర్సిపి చూస్తూ ఊరుకోబోదన్నారు.
Social Plugin