Hot Posts

6/recent/ticker-posts

సౌత్ కోస్ట్ రైల్వే అభివృద్ధికి కేంద్రం కీలక అడుగు.. ప్రధానికి పవన్‌ కల్యాణ్‌ కృతజ్ఞతలు


దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు జీఎం సందీప్‌ మాధుర్‌ నియామకం..

హర్షం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
సందీప్ మథూర్‌కు శుభాకాంక్షలు తెలిపిన పవన్..
ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన జనసేనాని..

ANDRAPRADESH: సౌత్ కోస్ట్ రైల్వే (దక్షిణ కోస్తా రైల్వే జోన్‌) అభివృద్ధికి కేంద్రం కీలక ముందడుగు వేసింది.. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సందీప్‌ మాధుర్‌ను జీఎంగా నియమించింది రైల్వే బోర్డు.. ఈ మేరకు గురువారం రోజు ఉత్తర్వులు జారీ చేశారు.. ఢిల్లీ రైల్వే సిగ్నల్‌ ఆధునికీకరణ ప్రాజెక్టు సారథిగా ఉన్న సందీప్‌ మాధుర్‌ కు సౌత్ కోస్ట్ రైల్వే బాధ్యతలు అప్పగించారు.. దీనిపై ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా స్వాగతించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. సందీప్ మథూర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూనే.. దీనికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు పవన్‌ కల్యాణ్‌..

సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు జీఎం నియామకంపై ఎక్స్‌ (ట్విట్టర్‌)లో స్పందించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. సౌత్ కోస్ట్ రైల్వే అభివృద్ధికి కేంద్రం కీలక అడుగు వేసింది.. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది.. సందీప్ మథూర్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్‌గా నియమించిందని పేర్కొన్నారు.. రైల్వే కార్యకలాపాలకు నూతన దిశలో వేగవంతమైన పురోగతిగా అభివర్ణించారు.. 

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు కేంద్ర నిర్ణయం అర్థం చెబుతోంది.. ఎన్‌డీఏ ప్రభుత్వం చొరవతో సౌత్ కోస్ట్ రైల్వే అభివృద్ధిలో కీలక పరిణామం ఇది అన్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల దీర్ఘకాలకోరికకు ఈ నిర్ణయం న్యాయం చేస్తుందన్నారు.. ఇక, సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ జీఎం సందీప్ మథూర్‌కు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. భారత ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు..