ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారిని తాడేపల్లిగూడెం డిపో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు చోడగిరి వెంకటరమణ గురువారం ఏలూరులోని చైర్మన్ గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిగూడెం డిపోలో ఉన్న ఆర్టీసి ఉద్యోగుల సమస్యలను జోనల్ చైర్మన్ కి వెంకటరమణ వివరించారు. ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఆర్టీసీ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హామీ ఇచ్చారని వెంకటరమణ తెలిపారు. ఆయన వెంట పలువురు ఆర్టీసీ యూనియన్ సభ్యులు ఉన్నారు.
Social Plugin